Samantha: శోభిత నుండి ఆయన్ని కాపాడుకో.. తమన్నాకి సమంత సలహా..?
Samantha: ఏంటి శోభిత ధూళిపాళ్ల నుండి ఆయన్ని కాపాడుకో అంటూ సమంత ఎందుకు తమన్నాకి సలహాలు ఇచ్చింది..ఇంతకీ తమన్నా,శోభిత,సమంత మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వారి బంధం కొద్దిరోజులు బాగానే ఉంది.కానీ ఆ తర్వాత గొడవలు వచ్చి ఇద్దరు విడిపోయారు. వీళ్లు 2018లో విడాకులు తీసుకున్నారు. ఇక అదే 2018లో అక్కినేని ఫ్యామిలీలోకి నేను అడుగు పెట్టాను అంటూ శోభిత ధూళిపాళ్ల రీసెంట్ గా చెప్పింది.
Samantha advice to Tamannaah
అలాగే 2022లో తమ మధ్య పరిచయం పెరిగి ప్రేమలో పడ్డామని చెప్పింది. అయితే ఒక రకంగా చూసుకుంటే 2018 లోనే అక్కినేని ఫ్యామిలీలో శోభిత అడుగుపెట్టినప్పటి నుండే సమంత నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయనేది కొంతమంది చైతు సమంత విడాకులు తీసుకోవడం ఇష్టం లేని అభిమానుల వాదన.. అయితే రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నాగచైతన్య శోభితల జంటని సమంత అభిమానులు అస్సలు ఇష్టపడడం లేదు.( Samantha)
Also Read: Samantha: సమంతకు ఫార్మ్ హౌస్ ఇచ్చి ఆ కోరిక తీర్చుకున్న నిర్మాత..?
ముఖ్యంగా నాగచైతన్య, సమంత జంటకి కొంతమంది ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. ఆ అభిమానులందరూ నాగచైతన్య పక్కన శోభితను భార్యగా ఊహించుకోవడం లేదు.ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. అయితే ఆ వీడియోలో ఏముందంటే..శోభిత ధూళిపాళ్ల ఒక మోడ్రన్ డ్రెస్ వేసుకొని తమన్నా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి విజయ్ వర్మ దగ్గరికి వెళ్లి ఆయన చేతులని పట్టుకొని చేతులను తెగ నలిపేస్తోంది..
అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ వీడియోకి సమంత ఫోటోని యాడ్ చేసి తమన్నా శోభిత నుండి నీ లవర్ విజయ్ వర్మను నువ్వు సేవ్ చేసుకో అంటూ ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ సమంత ఇండైరెక్ట్ గా తమన్నాకు సలహాలిస్తోంది. బాయ్ ఫ్రెండ్ ను శోభిత నుండి కాపాడుకో అని చెబుతుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.( Samantha)