Rajinikanth: అమలతో రజినీకాంత్ ప్రేమాయణం.. రెండో పెళ్లి కూడా..?
Rajinikanth: ప్రస్తుతం చాలామంది హీరోలు ఫ్యాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా అనే పదం రాకముందే ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో రజనీకాంత్ కూడా ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ ఇలా ఒక్క ఇండస్ట్రీ కాదు భారతదేశం మొత్తంలో రజనీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి రజనీకాంత్ బస్ కండక్టర్ స్థాయి నుంచి హీరో స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.
Rajinikanth love affair with Amala
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఆయన ఎదిగారు. సాధారణంగా హీరో కావాలి అంటే మంచి బాడీ సౌష్టవం, కలర్, హైట్ పర్సనాలిటీ అన్ని ఉండాలి అంటారు. కానీ రజనీకాంత్ కు ఇవేవీ లేకుండానే తనదైన శైలి యాక్టింగ్ తో హీరోగా నిలదొక్కుకున్నారు. ఇప్పటికి ఏడుపదుల వయస్సు దాటినా కానీ ఏ మాత్రం తగ్గని యాక్టింగ్ తో దూసుకుపోతున్నారు. అలాంటి రజనీకాంత్ యంగ్ దశలో ఉన్నప్పుడు ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు. (Rajinikanth)
Also Read: Amritha Aiyer: పెళ్లికి రెడీ అంటున్న హనుమాన్ హీరోయిన్.. అబ్బాయి అతడే..?
అలా నాగార్జున భార్య ఆయన అమలతో కూడా ఆయన అనేక చిత్రాలు చేశారు. అయితే వీరు వరుసగా మాఫీలై, కోడిపలత్తు,, తలైకరణ్, వంటి సినిమాల్లో చేశారు. ఈ సినిమా చేసే సమయంలో రజినీకాంత్ కు 36 సంవత్సరాలు, అమలకు 19 సంవత్సరాలు. అప్పటికి వీరి కాంబోలో సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎంతగానో ఎదురు చూసేవారు. అలా అభిమానులకు నచ్చిన జంటగా వీరు పేరు తెచ్చుకున్నారు.
అలాంటి ఈ సమయంలోనే వీరి మధ్య ఏదో నడుస్తుందని అందుకే వరుసగా సినిమాలు చేస్తున్నారని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు రజినీకాంత్ తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. అయితే అలాంటి ఈ వార్తలు అన్నింటిపై తాజాగా ఒక తమిళ హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది. అమల రజినీకాంత్ మధ్య ఏమి జరగలేదని, కొంతమంది రజినీకాంత్ పేరు బదనాం చేయాలని ఫేక్ వార్తలు క్రియేట్ చేశారని క్లారిటీగా చెప్పింది.(Rajinikanth)