Venkatesh: ఏంటి నిజంగానే పవన్ తో దగ్గుబాటి సురేష్ బాబు గొడవ పెట్టుకున్నారా..వీరిద్దరి మధ్య గొడవ పెట్టుకునేంత సమస్య ఎందుకు వచ్చింది.ఇద్దరి మధ్య జరిగిన గొడవకి వెంకటేష్ ఎలా స్పందించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. దగ్గుబాటి కుటుంబం నుండి రామానాయుడు నిర్మాతగా చేస్తే ఆయన ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతగా చిన్న కొడుకు వెంకటేష్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.
Suresh Babu had a fight with Pawan.. What did Venkatesh do in anger
ఇక సురేష్ బాబు హీరో కటౌట్ ఉన్నప్పటికీ తనకి బిజినెస్ చేయాలి అనే కోరిక ఉండడంతో సినిమా హీరోగా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగారు. అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలకు నిర్మాతగా చేశారు సురేష్ బాబు. అయితే అలాంటి సురేష్ బాబు వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల సినిమాకి మరో నిర్మాత శరత్ మరార్ తో కలిసి ఈ మూవీని నిర్మించారు. (Venkatesh)
Also Read: Sai Pallavi: 10 ఏళ్లుగా లవ్..డ్రీమ్ బాయ్ అతడే.. ఫస్ట్ టైం సీక్రెట్ చెప్పిన సాయి పల్లవి.?
అయితే ఈ సినిమా సమయంలో పవన్ సురేష్ బాబు మధ్య గొడవలు తలెత్తాయట. అయితే ఈ విషయం నిజమేనని సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే మా ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవలు ఏమీ జరగలేదు.చిన్న చిన్న ఇష్యూస్ అంతే అవి ప్రస్తుతం సర్దుమనిగాయి. ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటున్నాం. ఇద్దరి మధ్య గొడవ ఏమీ లేదు అంటూ చెప్పారు. కానీ గతంలో వీరిద్దరి మధ్య రెమ్యూనరేషన్ విషయంలో గొడవ జరిగిందని తెలుస్తోంది.
ఎందుకంటే గోపాల గోపాల సినిమాకి కొద్దిరోజులు కాల్షీట్లు ఇచ్చాక ఆ తర్వాత మరిన్ని కాల్షీట్లు కావాలని సురేష్ బాబు అడగడంతో దానికి అదనపు రెమ్యూనరేషన్ ఇవ్వాలని పవన్ అడిగాడట.కానీ ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైంది నేను ఇవ్వలేను అని సురేష్ బాబు పవన్ తో గొడవకు దిగారట. ఇక ఈ గొడవలో వెంకటేష్ కల్పించుకొని ఇద్దరికీ సర్దిచెప్పారని అప్పట్లో టాలీవుడ్ లోని కొంతమంది మాట్లాడుకున్నారు.(Venkatesh)