Bunny: థమ్సప్ యాడ్ కి బన్నీ తీసుకున్న రెమ్యూనరేషన్ తో ఓ సినిమా తీయచ్చు.. అన్ని కోట్లా..?
Bunny: చాలామంది సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూ సంపాదిస్తూనే మరోవైపు వ్యాపార ప్రకటనలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ ఉంటారు.అయితే కొంతమంది హీరోలు వ్యాపార ప్రకటనలకు దూరంగా ఉంటారు అలా కొంతమంది మాత్రమే. కానీ చాలా మంది సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఇన్ని రోజుల వరకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే తాజాగా అల్లు అర్జున్ థమ్సప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.
Did Bunny take all the crores for Thumsup add
ఇక పుష్ప-2సినిమా విడుదలయ్యాక అల్లు అర్జున్ నటించిన థమ్సప్ థండర్ వైల్డ్ ఫైర్ యాడ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.అయితే థమ్సప్ యాడ్ కోసం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కోట్లలో తీసుకున్నారట. మరి ఇంతకీ అల్లు అర్జున్ ఈ యాడ్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.థమ్సప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మొదట్లో చిరంజీవి ఉండేవారు.కానీ ఆ తర్వాత ఆయన అందులో నుండి తప్పుకున్నారు. ఇక చిరంజీవి తర్వాత మహేష్ బాబు 2006 నుండి 2023 వరకు థమ్సప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగారు. (Bunny)
Also Read: Rashmika Mandanna: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న రష్మిక మందన్నా.?
థమ్సప్ యాడ్ లో ఎక్కువగా మహేష్ బాబు కనిపించేవారు. కానీ పుష్పటు విడుదలకు ముందు పుష్ప రాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. 2023లోనే బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటికీ పుష్ప టు విడుదలయ్యాక ఆయనకు సంబంధించిన ఈ యాడ్ విడుదలైంది.ప్రస్తుతం పుష్పరాజ్ చేసిన థమ్సప్ థండర్ వైల్డ్ ఫైర్ యాడ్ మంచి క్రేజ్ సంపాదించింది.అయితే ఈ యాడ్లో నటించడం కోసం బన్నీ ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
ఇక ఈ రెమ్యూనరేషన్ ఇండియాలోనే అత్యంత భారీ రెమ్యూనరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఒక యాడ్ కోసం అన్ని కోట్లు ఎవరు తీసుకోలేదు. ఇక గతంలో థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన మహేష్ బాబు కేవలం 6 కోట్లే తీసుకుంటే బన్నీ మాత్రం మహేష్ రెమ్యూనరేషన్ కి రెట్టింపుగా 12 కోట్లు తీసుకున్నారట. అలా అల్లు అర్జున్ సినిమాలతో పాటు పలు వ్యాపార ప్రకటనలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కోట్లు సంపాదిస్తున్నారు. అందుకే రీసెంట్గా పుష్ప-2 సినిమాతో ఆయన ఆస్తులు కూడా పెరిగిపోయాయని నెట్టింట టాక్ ఆకు వినిపిస్తోంది.(Bunny)
https://www.instagram.com/reel/DCWfI6kyFmZ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==