Jr. NTR:మెగా హీరోని అవమానించిన Jr.ఎన్టీఆర్.. నాగార్జున వార్నింగ్ తో.?
Jr.NTR: తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి వ్యాల్యూ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా స్థాయిలో హీరోగా నిలదొక్కుకున్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సమయంలో 18 సంవత్సరాల వయసే ఉన్నారు. అయితే ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. అదే ఏడాది సుబ్బు, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాలు కూడా వచ్చాయి.
Jr.NTR who insulted mega hero
అప్పటికి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయం ఎన్టీఆర్ కు తెలియదు. అప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చి కాస్త హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ కు రాజమౌళి రూపంలో మంచి హిట్ అందింది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ పేరు పాపులర్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆది సినిమా మరో హిట్ అయింది. అలా సాగుతున్న సమయంలోనే రాజమౌళితో సింహాద్రి అనే సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. (Jr.NTR)
Also Read: Bunny: థమ్సప్ యాడ్ కి బన్నీ తీసుకున్న రెమ్యూనరేషన్ తో ఓ సినిమా తీయచ్చు.. అన్ని కోట్లా..?
అలా ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ సంచలమైన కామెంట్స్ చేశారు.ఒక టీవీ లైవ్ షో లో ఆయన మాట్లాడుతున్న టైంలో యాంకర్.. ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఉన్న చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగారట.. దీంతో ఎన్టీఆర్ ఆయన ఎవరో నాకు తెలియదని నాకు స్టార్ అంటే మా తాతయ్య ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారట. అది లైవ్ షో కాబట్టి ఈ మాటలు విని చాలామంది షాక్ అయిపోయారు. ఈ లైవ్ షో ఇంటి దగ్గర నుంచి చూసిన నాగార్జున వెంటనే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు.
నీకంటే పెద్ద వాళ్ల గురించి మాట్లాడేది ఇదేనా అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఎన్టీఆర్ కు ఆ వయసులో తాను తప్పు మాట్లాడుతున్నాను అనే విషయం అర్థం కాలేదు. తర్వాత తర్వాత రోజుల్లో ఆయన వయసు పెరిగే కొద్దీ సినిమాల్లో కూడా స్టార్ గా మారారు. మాటల తీరు కూడా మార్చుకొని చాలా పరిపక్వత చెందారు. ప్రస్తుతం ఆయన ఏదైనా స్టేజ్ మీద మాట్లాడితే అద్భుతమైన మాట తీరుతో, ఎవరినైనా గౌరవించే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఎన్నో అనుభవాల నుంచి ఎన్టీఆర్ చాలా నేర్చుకున్నారని తెలుస్తోంది.(Jr.NTR)