Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి వింత డిమాండ్.. నిర్మాతలను పిండేస్తుందిగా..?
Meenakshi Chaudhary: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే మీనాక్షి చౌదరి పేరు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది మీనాక్షి చౌదరి నటించిన గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మెకానిక్ రాఖి, మట్కా,ది గోట్ వంటి వరుస సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మీనాక్షి చౌదరి తన హవా చూపించింది. మీనాక్షి చౌదరి నటించిన విడుదలైన సినిమాల్లో మెకానిక్ రాఖీ, లక్కీ భాస్కర్, ది గోట్,గుంటూరు కారం వంటి సినిమాలు హిట్ అయ్యాయి.

Meenakshi Chaudhary strange demand
ఈ సినిమాల్లో మీనాక్షి చౌదరికి పేరు వచ్చిన సినిమాలు లక్కీ భాస్కర్,ది గాడ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత ఈ హీరోయిన్ చేతిలో ఇంకా ఎన్నో ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బన్నీ త్రివిక్రమ్ కాంబోలో రాబోయే సినిమాలో కూడా హీరోయిన్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో సంక్రాంతికి మనం ముందుకు రాబోతోంది.(Meenakshi Chaudhary)
Also Read: Samantha: శోభిత నుండి ఆయన్ని కాపాడుకో.. తమన్నాకి సమంత సలహా..?
ఇదిలా ఉంటే పాపులర్ అవ్వగానే మీనాక్షిచౌదరి నిర్మాతలను డబ్బులు డిమాండ్ చేస్తూ తెగ పిండేస్తోందట. మరి ఇంతకీ మీనాక్షి చౌదరి ఏం చేస్తుందంటే.. చాలామంది నాన్ లోకల్ హీరోయిన్స్ షూటింగ్ కోసం వచ్చి ఫ్లాట్ రెంట్ తీసుకుని ఉంటే వారి ఫ్లాట్ రెంటు కడతారు నిర్మాతలు.. అయితే మీనాక్షి చౌదరికి ఆ బాధ లేదు.ఎందుకంటే హైదరాబాదులో షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు తన ఇంట్లోనే ఉండొచ్చు.

ఎందుకంటే మీనాక్షి చౌదరికి హైదరాబాదులో ఓన్ ఫ్లాట్ ఉంది. కానీ మీనాక్షి చౌదరి మాత్రం నాన్ లోకల్ హీరోయిన్స్ లాగే నా ఫ్లాట్లో ఉంటున్నందుకు నాకు కూడా మీరు డబ్బులు చెల్లించాలి అని రోజుకు 18,000 చెల్లించాల్సిందే అంటూ కొత్త కండిషన్లు పెడుతుందట. ఇక మీనాక్షి చౌదరి కండిషన్స్ కి నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట.(Meenakshi Chaudhary)