Ashwin Pension: వినోద్ కాంబ్లీ కంటే.. ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న అశ్విన్?

Ashwin Pension: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కంటే… రవిచంద్రన్ అశ్విన్ ఎక్కువగా పెన్షన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ… నెలకు 30 వేల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారట. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫిక్స్ చేసిందట. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించి… నెలకు 60 వేల పెన్షన్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారట. Ashwin Pension

Why just-retired Ashwin gets more pension than Kambli

అంటే వినోద్ కాంబ్లీ కంటే ఎక్కువగా పెన్షన్ తీసుకుంటున్నాడు రవిచంద్రన్ అశ్విన్. దీనికి పెద్ద కారణమే ఉంది. వినోద్ కాంబ్లీ ఇప్పటి వరకు 17 టెస్టులు మాత్రమే ఆడాడు. అదే రవిచంద్రన్ అశ్విని మాత్రం 106 టెస్టులు ఆడి రికార్డు సృష్టించాడు. అందుకే వినోద్ కాంబ్లీ… ఫస్ట్ క్లాస్ క్రికెట్ కేటగిరీలో పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇటు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం… మాజీ టెస్ట్ ప్లేయర్ తీసుకునే పెన్షన్ తీసుకుంటున్నాడు. అందుకే అశ్విన్ కు ఎక్కువగా పెన్షన్ వస్తోంది. Ashwin Pension

Also Read: Nara Bhuvaneshwari: బాలయ్య డైలాగ్ తో రెచ్చిపోయిన నారా భువనేశ్వరి ?

ఇది ఇలా ఉండగా రెండు రోజుల కిందట అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రిటైర్మెంట్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడవ టెస్ట్ ముగిసిన వెంటనే ఈ ప్రకటన చేశారు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ మాత్రం ఆడతానని ప్రకటించాడు రవిచంద్రన్ అశ్విన్. Ashwin Pension

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *