Idli-Dosa Flour: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం వల్ల ఇంట్లో వండుకోకుండా బయటి ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. తద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పూర్వకాలంలో చాలామంది కేవలం ఇంటి ఆహారాన్ని మాత్రమే తినేవారు. వారు చాలా ఆరోగ్యంగా, బలంగా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండేవారు. Idli-Dosa Flour
Supermarket idli and dosa flour are used
నేటి కాలంలో చాలామంది పనులు తప్పించుకోవడానికి రెడిమేడ్ ఆహారాన్ని తెచ్చుకొని ఇంట్లో వండుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి బయట మార్కెట్లలో రెడీమేడ్ దోశ పిండి, ఇడ్లీ పిండి అమ్ముతున్నారు. ఇక చాలామంది సులభంగా పని అయిపోతుందని దోశ పిండి, ఇడ్లీ పిండి కొని తెచ్చుకొని ఐదు నిమిషాలలో వాటిని చేసుకుంటున్నారు. అలా తినడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయని వైద్య నివేదికలో వెల్లడైంది. Idli-Dosa Flour
Also Read: Electric Scooter: భారత్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..85 KM మైలేజ్
ఉదయం పూట అల్పాహారం చేసుకునేవారు ఇంట్లోనే ఇడ్లీ, దోశ పిండిని తయారు చేసుకోవాలని చెబుతున్నారు. రెడిమేడ్ ఇడ్లీ, దోశ పిండి తినడం వల్ల కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. బయట మార్కెట్లలో దొరికే దోస, ఇడ్లీ పిండి పులిసిపోకుండా ఉండడానికి ప్యాకెట్స్ నీ బోరిక్ యాసిడ్ తో కోటింగ్ చేస్తున్నారు. తద్వారా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. బోరిక్ యాసిడ్ కలిపిన పిండి వల్ల కడుపులోని పేగులకు హాని కలుగుతుంది. ఆ పిండి తినడం వల్ల విరేచనాలు, గ్యాస్, గుండెలో మంట వంటి సమస్యలు వస్తున్నాయి. Idli-Dosa Flour
అంతేకాకుండా చర్మం పొడిబారటం కాళ్లు, చేతులు వాపులు వంటి వ్యాధులు వస్తున్నాయి. తద్వారా బయట దొరికే పిండిని అసలు తినకూడదని చెబుతున్నారు. ఇక మరి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ పిండితో చేసిన దోశ, ఇడ్లీలు పెట్టడం వల్ల వారి పెరుగుదలలో అనేక రకాల లోపాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కడుపునొప్పి, మైగ్రేన్ వంటి వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. ఇకనుంచి అయినా బయట మార్కెట్లలో దోస, ఇడ్లీ పిండిని కొనుగోలు చేయకూడదని ఇంట్లోనే తయారు చేసుకొని తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Idli-Dosa Flour