Heroine: సినిమా పరిశ్రమలో చాలా మంది అనుకున్న లక్ష్యాల కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారని చెబుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్ లు తాము నటులు కావాలని ఎప్పుడూ అనుకోలేదని, అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చామని అంటుంటారు. అలా ఈ ఫోటో లో కనిపిస్తున్న అమ్మాయి ఐఏఎస్ అధికారిణి కావాలనుకుంది. కట్ చేస్తే, ఆమె ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అగ్రగామి హీరోయిన్ గా స్టార్ డమ్‌ అందుకుంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. వ్యాపార ప్రకటనల్లోనూ మెరుస్తోంది.

Heroine Rashi Khanna Childhood Photo

ఈ అమ్మాయి వాసెలిన్ వాణిజ్య ప్రకటనలో కూడా చేసింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ రాశి ఖన్నా. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రాశి ఖన్నా. ‘ఉహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా తన మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది. అతి తక్కువ సమయంలోనే విశేష ఆదరణ పొందింది. టాలీవుడ్ యువ హీరోల సరసన చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు.

Also Read: Kamal Haasan: కమల్ హాసన్ సినిమా కు చుక్కెదురు.. విడుదల ఆపాలని కోర్టు నోటీసు!!

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ లీడింగ్ లేడీ. ఆమె ఇటీవల యోధా చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించింది. రాశీ ఖన్నా వాస్తవానికి హిందీ చిత్రాలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్‌లో ఆమె తొలిసారిగా నటించింది. ఈ సినిమాలో రాఖీ ఖన్నాది చిన్న పాత్ర. దీని తర్వాత ఈ బ్యూటీకి తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. తాజాగా అరణ్మనై 4 సినిమాలో నటించింది.

ప్రస్తుతం ఆమె సబర్మతి రిపోర్ట్ మూవీ, తలాఖోన్ మే ఏక్ వంటి తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఆమె తెలుగులో పలు సినిమాలలో నటిస్తుంది. మరి అనుకున్న దానికంటే తక్కువ ఫేమ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికైనా మంచి అవకాశాలు అందుకుంటుందా అనేది చూడాలి.