Mister Bachchan: రవితేజ హీరో గా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ మూవీ రైడ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘సితార్’ అనే పాట రిలీజ్ అయ్యింది.  ఈ పాటలో హీరో రవితేజ సరసన హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే నటించగా ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకర్షించింది. అయితే ఇందులో హీరోయిన్ ను చూపించిన విధానాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. దాంతో ఇది సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది.

Criticisms on Raviteja Mister Bachchan Song

ఈ పాటలో భాగ్య శ్రీ భోర్సే తన ముఖం కంటే శరీరాన్ని ఎక్కువగా చూపించారని నెటిజన్లు విమర్శించారు. కొంత మంది నెటిజన్లు హీరోయిన్‌ని బొమ్మలా భావిస్తున్నారని దర్శకుడును  విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. హీరోయిన్ ను చూపించిన విధానం అసభ్యకరంగా ఉందని పోస్ట్‌లో పేర్కొన్నారు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా రోజులుగా తెరకుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇలాంటి విమర్శలు రావడం నిజంగా ఆశ్చర్యకరమే.

Also Read: Ram Charan: తెలంగాణ లోనే ఈ కారు ఉన్న ఏకైక హీరో రామ్ చరణ్.. ధర ఎంతంటే.?

అయితే ఈ విమర్శలపై హరీష్ శంకర్ స్పందించారు. ఈ పాటపై మీ పరిశీలనలకు నోబెల్ బహుమతి ఇవ్వాలి. సినిమాలు చూసేటప్పుడు మీరు కూడా అలర్ట్‌గా ఉండాలని బదులిచ్చారు. మరి వివాదం ఇంతటితో ముగుస్తుందా అనేది చూడాలి. తొలి లిరికల్ సాంగ్ గా మిస్టర్ బచ్చన్ సినిమా లోనుంచి ‘సితార్’ పాటను విడుదల చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తొందరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.