PV Sindhu: పీవీ సింధు దంపతుల ఆస్తులు ఎంతో తెలుసా ?
PV Sindhu: బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. పీవీ సింధు నెట్వర్క్ ఎంత అనే విషయానికి వస్తే తన సంపాదన క్రికెటర్లకు ఏమాత్రం తగ్గదు. పీవీ సింధు వయసు 29 సంవత్సరాలు. డిసెంబర్ 22న పోసిడెక్స్ టెక్నాలజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు సాయి సింధు మూడుముళ్ల బంధం లోకి అడుగు పెట్టారు. PV Sindhu
A look at PV Sindhu massive net worth
వీరి వివాహానికి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలోనే పీవీ సింధు నెట్వర్త్ పైన సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. కేవలం ఆటతోనే కాదు బ్రాండ్లతోను సింధు భారీగా డబ్బులను సంపాదిస్తోంది. ఈ లెక్క ప్రకారం పీవీ సింధు క్రికెటర్లతో సమానంగా సంపాదిస్తోంది. ప్రకటనలోను వారితో పోటీపడుతోంది. ప్రస్తుతం సింధు నికర విలువ దాదాపు రూ. 60 కోట్లకు పైనే ఉందని సమాచారం. ఇందులో ప్రైస్ మనీ రూపంలో వచ్చిన డబ్బులతో పాటు ప్రకటనలతో వచ్చిన డబ్బు కూడా ఉంది. PV Sindhu
Also Read: Allu Arjun Police Inquiry: మళ్ళీ స్టేషన్ కు అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటన రీ కన్స్ట్రక్షన్!!
ప్రైస్ మనీ కన్నా ప్రకటనలతోనే భారీగా డబ్బులను కూడా పెట్టింది. సింధు దగ్గర లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. బిఎండబ్ల్యూ ఎక్స్ 5, మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ 320డి, డాట్సన్ రెడీ గో కార్లు మాత్రమే కాకుండా చాలా రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. గత కొంతకాలం నుంచి బ్యాడ్మింటన్ క్వీన్ పెద్దగా రాణించడం లేదు. 2023లో పేలవ ప్రదర్శనతో సింధు విఫలమయింది. 2024 లోను ఏమాత్రం ప్రభావం చూపించలేదు. వివాహం తర్వాత ఆటలో కొనసాగుతారా లేదా అన్నది చూడాలి. అయితే త్వరలోనే సింధు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయం పైన సింధు స్పందిస్తే గాని అసలు విషయం తెలియదు. PV Sindhu