Ravathi: రేవతి చనిపోవడానికి అసలు కారణం అదే.. డాక్టర్స్ షాకింగ్ రిపోర్ట్..?
Revathi: సాధారణంగా సినీ ఇండస్ట్రీ వాళ్లు ఏ తప్పు చేయకముందే ఏదో చేశారంటూ సృష్టిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ రోజుల్లో, ఒకవేళ వారు తప్పు చేస్తే మాత్రం ఇంకెంత హంగామా చేస్తారో అల్లు అర్జున్ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప2 సినిమా డిసెంబర్ 4వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో అంగరంగ వైభవంగా రిలీజ్ అయింది. మొదటి రోజే హౌస్ పూల్ కలెక్షన్స్ తో అభిమానుల తాకిడితో థియేటర్లు అతలాకుతలమయ్యాయి.
That is the real reason for Revathi death Doctor shocking report
ఈ క్రమంలోనే హైదరాబాదులోని సంధ్య థియేటర్ లో అభిమానుల తాకిడి గురించి ఒక్క మాటలో చెప్పలేం. దీనికి తోడు అల్లుఅర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఆ థియేటర్ కు సినిమా చూడడానికి వచ్చారు. ఇంకేముంది అభిమానులు రెట్టింపు అయిపోయారు. ఆ థియేటర్ కి సినిమా చూడడానికి వచ్చినటువంటి రేవతి ఫ్యామిలీ అక్కడ జరిగినటువంటి తొక్కి సలాటలో మరణించింది. ఇక తన కొడుకు శ్రీతేజ్ దారుణంగా గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్లాడుతున్నారు.(Revathi)
Also Read: Pushpa 2: అస్సలు తగ్గేదెలే..భారీ రేంజ్ లో దూసుకుపోతున్న ‘పుష్ప2’ కలెక్షన్స్!!
ఈ యదార్థ సంఘటన జరగడంతో తెలంగాణ ప్రభుత్వం సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లుఅర్జున్ పై కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేసింది. దీంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాదు రేవతి వ్యవహారం గురించి అసెంబ్లీలో చివరికి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరుణంలో రేవతి చావుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.
అయితే ఈమె సంధ్య థియేటర్ తొక్కి సలాటలో మరణించలేదని, ఒకవేళ తొక్కిసలాట జరిగి ఉంటే వారి శరీరంలో ఎముకలు తప్పనిసరిగా విరిగి ఉండేవని లేదంటే కనీసం శరీరంపై గాయాలై ఉండేవని వైద్యుల నివేదికలో తేలినట్టు తెలుస్తోంది. వీరు తొక్కిసలాటలో కాకుండా అక్కడ ఉన్న క్రౌడులో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారని, రేవతి ఊపిరి ఆడకుండానే మరణించిందని, శ్రీ తేజ్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాడని వైద్యుల నివేదికలు వెళ్లడైనట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో ఏది ఏమైనా ఆ సినిమా వల్లే వారు మరణించారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Revathi)