Raj Tarun Real charecter

Raj Tarun: కొంతమంది హీరోలు సినిమాల్లో ఎన్నో నీతులు చెబుతూ కనిపిస్తూ ఉంటారు. కానీ బయట వారి నిజ స్వరూపం అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో బయటపడ్డ సమయంలో చాలామంది జనాలు వామ్మో వీరి నిజస్వరూపం ఇదా అని షాక్ అవుతూ ఉంటారు.ప్రస్తుతం మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న రాజ్ తరుణ్ గురించి తెలిసిన చాలా మంది జనాలు ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు.అయితే రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారినట్టు ఎక్కడికో దారితీస్తుంది.

Raj Tarun Real charecter

అయితే లావణ్య రాజ్ తరుణ్ ల వ్యవహారంపై తాజాగా లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర సంచలన కామెంట్స్ చేశారు.ఆయన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ పై కేసు పెట్టి ఆయనను జైలు పాలు చేయాలని లావణ్య అనుకోలేదు. మాల్వి మల్హోత్రా అనే క్యారెక్టర్ వీరిద్దరి మధ్య దూరడంతో ఆమె గురించి తనకు ప్రాణ భయం ఉంది అనే విషయంపై కేసు పెట్టింది. దీంతో రాజ్ తరుణ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. (Raj Tarun)

Also Read: Anchor Anasuya: యాంకర్ అనసూయని భర్తతో విడదీయాలని చూసిన అమ్మాయి.. ఎవరంటే.?

ఇక రాజ్ తరుణ్ లావణ్యను పెళ్లి చేసుకోలేదు అని అంటున్నాడు.అందులో ఎలాంటి నిజం లేదు. పెళ్లి చేసుకోలేదు అనేవాడు విడాకులు ఇస్తానని ఎలా అంటున్నాడు. ఇక్కడే రాజ్ తరుణ్ అసలు నిజ స్వరూపం బయటపడింది.రాజ్ తరుణ్ లావణ్య తో పది సంవత్సరాలకు పైగా రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఈ రిలేషన్ లో రెండు సార్లు లావణ్య ప్రెగ్నెంట్ అయింది. ఓసారి మిస్ గ్యారేజ్ అయితే మరోసారి రాజ్ తరుణ్ దగ్గరుండి ఆమె ప్రెగ్నెన్సీ తీయించాడు. దానికి సంబంధించిన అన్ని మెడికల్ డాక్యుమెంట్లు ఉన్నాయి.

Raj Tarun Real charecter

అంతేకాదు రాజ్ తరుణ్ లావణ్యను చాలా హింసించాడు. తనని వదిలేయమని ఎన్నోసార్లు చెప్పాడట. ఇలావణ్య వదలకపోవడంతో తన ఇంటిని కూడా లావణ్యకి ఇచ్చేసి మాల్వితో హోటల్ లో, ముంబైలో గడుపుతున్నాడు.అలాగే తనని వదిలిపెట్టడం లేదు అనే కోపంతో రాజ్ తరుణ్ లావణ్య తలపై బీర్ బాటిల్ తో కొట్టాడు అంటూ లావణ్య తరపు న్యాయవాది సంచలన విషయాలు బయట పెట్టారు. దీంతో ఈ విషయం తెలిసిన జనాలు రాజ్ తరుణ్,లావణ్యని చంపాలని పెద్ద ప్లానే వేశాడు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Raj Tarun )