Chiranjeevi: రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారు.. చిరంజీవి ఫైర్.?
Chiranjeevi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా చనిపోయిన రేవతి వ్యవహారం గురించి వినిపిస్తోంది. ఒక అల్లు అర్జున్ వల్ల ఇండస్ట్రీ వారందరిపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవతి వ్యవహారాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అంటగట్టి ఆయనను దారుణంగా కించపరిచారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ పై కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు మండిపడ్డారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇకనుంచి బెనిఫిట్ షోలు ఉండవని టికెట్ల రేట్లు పెంచేది లేదని కరాకండిగా చెప్పేసింది.
Why politicians fall on film industry Chiranjeevi fire
దీంతో ఇకముందు రిలీజ్ అయ్యే సినిమాలపై ఈ ప్రభావం పడి అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు, పెద్దలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సినీ ఇండస్ట్రీవారు ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. ఒక అల్లు అర్జున్ వల్ల మేమందరం నష్టపోవాలా అంటూ మాట్లాడుతున్నారట. ఇదే క్రమంలో గతంలో మెగాస్టార్ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. ఇండస్ట్రీలో మేము సినిమాలు తీసేది లాభాల కోసం కాదని, ఒక సినిమా తీస్తే వేలాదిమంది బతుకుతారని వారి కడుపు నిండుతుందని అన్నారు. (Chiranjeevi)
Also Read: Tollywood: దిల్ రాజు మాట సీఎం రేవంత్ వింటాడా.. పెద్ద చిక్కే?
కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను తప్పుగా చిత్రీకరిస్తూ పార్లమెంట్ ఇతర సభల్లో చర్చించడం సరికాదని తెలియజేశారు. మేము నటిస్తేనే నలుగురికి ఉపాధి దొరికి మాకు కూడా నాలుగు డబ్బులు వస్తున్నాయని అన్నారు. అలా ఉపాధి చూపించే ఇండస్ట్రీపై ఇలా రాజకీయం చేయడం సరికాదని తెలియజేశారు. దేశంలో ఇతర ఏ సమస్య లేనట్టు ఇండస్ట్రీ సమస్యలను పెద్దల సభలో మాట్లాడడం సమంజసం కాదని, చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దయచేసి సినిమాలను, రాజకీయాలను కలపొద్దని, మా కష్టాలు మేం పడతామని, నీకు వీలుంటే మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయండని రిక్వెస్ట్ చేశారు. అయితే ఈయన తెలంగాణ ప్రభుత్వం గురించి అయితే మాట్లాడలేదు. అప్పట్లో జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఇబ్బందులు వస్తే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. అయితే చిరు వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్ ఫంక్షన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది.(Chiranjeevi)