Anushka Shetty: అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. అయితే ఇప్పటికే ఈమె కాస్త లావు పెరిగిపోవడంతో చాలామంది ఈమెని ట్రోల్ కూడా చేస్తున్నారు. అయితే అనుష్క పెళ్లిపై ఇప్పటికే ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేసినప్పటికీ దానిపై స్పష్టత ఇవ్వడం లేదు.ఈమె పెళ్లి వార్తలు వైరలైన ప్రతిసారి దాన్ని ఖండించేస్తుంది. అయితే తాజాగా అనుష్క శెట్టి నాకు కాబోయే వాడు ఎవరో నేను ఇప్పటికే చూసుకున్నాను అంటూ చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది.
Anushka Shetty: He is the one I will marry
అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోయే వాడు ఎవరు అని అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే అనుష్క ఈ మాటలు ఇప్పుడు మాట్లాడినవైతే కావు. దాదాపు 10ఏళ్ల కిందటివి.సినీ నటి జయప్రద హోస్ట్ గా చేసిన జయప్రదం షో లో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియోలో అనుష్క శెట్టి ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం.. ఎవరైనా సెలబ్రిటీలు ఓ టాక్ షో కి వెళ్తే వాళ్లకు సంబంధించిన వైరల్ న్యూస్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు. (Anushka Shetty)
Also Read: Heroine: స్టార్ హీరోయిన్ అయినా తప్పని కష్టాలు.. దారుణంగా అవమానించారు గా!!
అయితే అప్పట్లో అనుష్కకి సంబంధించిన ఎన్నో విషయాలు జయప్రద ఆ టాక్ షో లో అడిగింది. ఇక జయప్రద అడిగిన వాటికి అనుష్క టకటక సమాధానాలు చెప్పేసింది. ఇందులో భాగంగా తన పెళ్లి మ్యాటర్ రాగ నాకు ఇప్పటికే చాలామంది పెళ్లి చేసేసారు. ఇండస్ట్రీలో ఉన్న ఐదుగురితో నా పెళ్లిలు చేశారు. అలా ప్రభాస్,సెంథిల్, గోపీచంద్ వంటి వారితో నా పెళ్లి జరిగినట్టు రాశారు అని చెప్పింది. అయితే మీ పెళ్లి ఎప్పుడు.. అరేంజ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా అని జయప్రద అడగగా..
నేను నాకు కాబోయే వాడిని ఎప్పుడో చూసుకొని పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు అతని పేరు మాత్రం చెప్పను.ఎందుకంటే ఇప్పుడు ఈ పేరు నేను చెబితే సోషల్ మీడియాలో నా మీద రచ్చ రచ్చ జరుగుతుంది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోను. ప్రస్తుతం కెరియర్ మీద ఫోకస్ పెట్టాను.మరో రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుంటాను అంటూ అనుష్క చెప్పింది. అయితే అనుష్క అప్పుడు రెండు మూడు ఏళ్లలో పెళ్లి చేసుకుంటానని చెప్పి దాదాపు 10 ఏళ్ల కి పైగా పూర్తయింది. కానీ ఇంకా కూడా పెళ్లి చేసుకోలేదు.(Anushka Shetty)