Pavitra Gowda who resented Darshan

Pavitra Gowda: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న దర్శన్ పవిత్ర గౌడల వ్యవహారంలో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో వీరి గురించి ఎక్కువగా వైరల్ అవ్వకపోయినప్పటికీ రెండు మూడు రోజులకు ఒకసారి అయితే వీరి వార్త కన్నడ మీడియాతో పాటు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది.అయితే తాజాగా దర్శన్ గురించి పవిత్ర గౌడ సంచలన విషయాలు బయట పెట్టిందట.

Pavitra Gowda who resented Darshan

అంతేకాదు దర్శన్ పై పగ పట్టినట్టు మాట్లాడి తన తల్లికి ఎన్నో షాకింగ్ విషయాలు చెప్పిందట.మరి ఇంతకీ తన ప్రియురాలు కోసం ఏకంగా హత్య చేసి జైలు జీవితం గడుపుతున్న దర్శన్ పై పవిత్ర గౌడ ఎందుకు కోపం తెచ్చుకుంది.వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనేది ఇప్పుడు చూద్దాం.. దర్శన్ పవిత్ర గౌడ ఇద్దరు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు.రేణుక స్వామి హత్య కేసులో ఇద్దరు నిందితులుగా చిప్ప కూడు తింటున్నారు. (Pavitra Gowda )

Also Read: Raj Tarun: లావణ్య కేసులో కొత్త ట్విస్ట్..లావణ్యకు అంత అన్యాయం చేశాడా!!

ఈ నేపథ్యంలోనే వీరిని కలవడానికి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు జైలుకు వెళ్లారు. ఇలాంటి తరుణంలోనే పవిత్ర గౌడ తల్లి పరప్ప అగ్రహారం కూతుర్ని చూడడానికి జైలుకు వచ్చిందట. దాంతో తల్లిని చూడగానే కన్నీళ్లు మున్నీరుగా విలపించిన పవిత్ర తన కష్టాలన్నీ చెప్పుకుంటూ తన గోడు వెళ్ళబోసుకుందట. అంతేకాదు దర్శన్ జైల్లో పడినప్పటి నుండి నన్ను దూరం పెడుతున్నాడని,నేను చేసిన తప్పేంటి నాకు అసభ్య మెసేజ్ లు పెడుతున్నాడని రేణుక స్వామి గురించి చెప్పాను.

Pavitra Gowda who resented Darshan

అందులో నా తప్పేముంది.దర్శన్ కి ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.. అంటూ పవిత్ర తన తల్లితో కష్టాలు చెప్పుకొని ఏడ్చిందట. అయితే ఈ మ్యాటర్ కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజెన్లు అసలు దర్శన్ జైలు జీవితం గడపడానికి కారణమే నువ్వు.అలాంటిది నేనే కారణం అని ఏడుస్తున్నావ్ ఏంటి..నువ్వు అనేదానివి దర్శన్ లైఫ్ లో లేకపోతే ఇదంతా జరిగేది కాదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Pavitra Gowda )