Bharatheeyudu 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన భారతీయుడు మూవీ 1996 మే 9న విడుదలైంది. ఈ సినిమా లో మనిషా కొయిరాలా, ఊర్మిల, సుకన్యలు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఆ సినిమా వచ్చిన దాదాపు 28 సంవత్సరాల కు భారతీయుడు -2సీక్వెల్ ను తీసారు డైరెక్టర్ శంకర్. అయితే ఈ సీక్వెల్ తీస్తూనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా తీశారు.ఇలా రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ రెండు సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చేశారు. అయితే తాజాగా వరల్డ్ వైడ్ గా విడుదలైన భారతీయుడు 2 మూవీ ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు పడిపోయాయి.
Bharatheeyudu 2 highlights
దీంతో మూవీ చూసిన జనాలు ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ఈ మూవీలోని ప్లస్ మైనస్ పాయింట్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు మూవీలో రకుల్ ప్రీత్ సింగ్,కాజల్ అగర్వాల్,ఎస్ జె సూర్య, సిద్ధార్థ్ వంటి నటీనటులు ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఉన్న హైలెట్స్ ఏంటంటే.. శంకర్ సినిమా అనగానే చాలామంది హోప్స్ పెట్టుకుంటారు.ఇక ఆ హోప్స్ తగ్గట్టుగానే ఈ సినిమా ఉందని అలాగే సెకండ్ హాఫ్ లో ఉండే యాక్షన్స్ సన్నివేషాలు అబ్బురపరిచినట్టు తెలుస్తుంది. (Bharatheeyudu 2 )
Also Read: Pavitra Gowda: దర్శన్ పై పగబట్టిన పవిత్ర గౌడ.. తల్లికి సంచలన విషయాలు చెబుతూ..!
అన్నింటికి మించి కమల్ హాసన్ సేనాపతి లుక్ లో సినిమాలో అదరగొట్టేసినట్టు రివ్యూలు ఇస్తున్నారు. అంతేకాకుండా సిద్ధార్థ్, కమల్ హాసన్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ మూవీకి హైలెట్ అని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న మెయిన్ మైనస్ పాయింట్లు ఏంటంటే..శంకర్ ఎప్పట్లాగే ఈ మూవీలోని ఫస్టాఫ్ ని చాలా పేలవంగా అసలు ఫస్టాఫ్ లో కథ కూడా ఏమీ లేదు. సెకండ్ హాఫ్ లోనే కథ మొత్తం ఉంది. అలాగే ఈ మూవీలోని బాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అనిరుధ్ బాగా కంపోజ్ చేయలేదనే నెగటివ్ టాక్ కూడా ట్విట్టర్ రివ్యూలలో కనిపిస్తోంది.
అలాగే కమల్ హాసన్ కి వేసిన ప్రోస్తాటిక్ మేకప్ ఆర్టిఫిషియల్ గా ఉన్నట్లు రివ్యూలు ఇస్తున్నారు. ఫస్టాఫ్ అటు ఇటుగా ఉన్నా సెకండాఫ్ మాత్రం శంకర్ తన దర్శకత్వ ప్రతిభను చూపెట్టారు. అలాగే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు గ్రాఫిక్స్ లాగా అనిపిస్తున్నాయట.ఇక ట్విట్టర్ ద్వారా కొంతమంది నెగటివ్ మరి కొంతమంది పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.మరి ఈ సినిమా పూర్తి టాక్ ఎలా ఉందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.(Bharatheeyudu 2 )