Nagarjuna: రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ భేటీ.. సడన్ గా షాకిచ్చిన నాగార్జున..?
Nagarjuna: ఈరోజు రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అవబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈరోజు ఉదయం సినీ నిర్మాతలైనటువంటి దిల్ రాజు,అల్లు అరవింద్ తో పాటు సినీ ఇండస్ట్రీ హీరోలైన వెంకటేష్, చిరంజీవి లు కూడా భేటీ అవబోతున్నట్టు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ ఈ భేటీలో పాల్గొనపోవడానికి కారణం బాలకృష్ణ ప్రస్తుతం బిజెపి పార్టీలో భాగమయ్యారు.
Tollywood meeting with Revanth Reddy Nagarjuna suddenly shocked
సినిమాల పరంగా ఓకే కానీ రాజకీయపరంగా ఆయన టిడిపి ఎమ్మెల్యే కాబట్టి రేవంత్ రెడ్డి ని కలవడానికి ఆయన ఇష్టపడడం తెలుస్తోంది.ఇక తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అనగానే అందరికీ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జుననే గుర్తుకొస్తారు. ఇక ఈ నలుగురిలో బాలకృష్ణ డుమ్మా కొట్టారు. అలాగే చిరంజీవి వెంకటేష్ లు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు(Nagarjuna)
Also Read: Pushpa-2: పుష్ప-2 లో చూపించినట్టే సీఎం మార్పు.. రేవంత్ రెడ్డి కుర్చీ కింద బాంబ్.?
కానీ సడన్గా నాగార్జున కూడా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఎందుకంటే చిరంజీవి వెంకటేష్ లు నాగార్జున కి ఫోన్ చేసి రేవంత్ రెడ్డిని కలుద్దాం అని అడగగా.. మొదట ఓకే అని చెప్పి ఆ తర్వాత నేను హైదరాబాదులో లేను ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా మాట్లాడారట..
అయితే రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అవ్వడంలో నాగార్జున కలవక పోవడానికి కారణం గత కొద్ది రోజులుగా నాగార్జునకి రేవంత్ రెడ్డికి పడటం లేదనే సంగతి మనకు తెలిసిందే.ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేశారో అప్పటి నుండి నాగార్జున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే టాలీవుడ్ సినీ పెద్దలు రేవంత్ రెడ్డి తో భేటీ అవుతున్నా కూడా నాగార్జున రేవంత్ రెడ్డి ని కలవడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.(Nagarjuna)