Bharatheeyudu2: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే కల్కి 2898 AD సినిమా పరిస్థితి మరింత దారుణంగా ఉండేదేమో. ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్ జగన్ కు బద్ధ వ్యతిరేకి అని అందరికి తెలిసిందే. ఆయన ఎన్నికల ముందు కూటమికి సంపూర్ణ మద్దతు తెలిపారు. జగన్ పై ప్రత్యక్ష విమర్శలకు కూడా వెనుకాడలేదు. అందుకే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ‘కల్కి’ని టార్గెట్ చేస్తారని తెలిసి కూటమి విజయానికి ఎంతో కృషి చేశారు.
No Ticket Hikes For Kamal Hasan Bharatheeyudu2
సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టికెట్ ఛార్జీల స్థాయి ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగానే పెరిగింది. దాదాపు 125 రూపాయల వరకు ధరలు పెంచారు. అయితే ఏపీలో ఇప్పటికే టికెట్ ధర పెరిగి ఉండగా కల్కి టికెట్ ధర మరింత పెరగడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Also Read: Boney Kapoor-Sridevi: పాపం.. ఆ సినిమా బోనీ కపూర్-శ్రీదేవి లను విడదీసిందని మీకు తెలుసా..?
ఈ విషయం తేలే వరకు కొత్త సినిమాల ధరలు పెంచడం కష్టం అని తేల్చేశారు. టిక్కెట్ ధరలను పెంచే స్థాయికి చేరుకోగల తెలుగు సినిమా ప్రస్తుతం ఏదీ లేదు. “దేవర” వచ్చే వరకు దీనికి ఓ పరిష్కారం దొరికేలా లేదు. అయితే ఈ వారం విడుదల కానున్న అనువాద చిత్రం “భారతీయుడు-2″కి ఇది ఇబ్బందిగా మారింది.
తెలంగాణలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. సినిమా లో అంతటి దమ్ము కూడా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ బాబు కూడా ఏపీ నుంచి అదనపు రేట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సురేశ్‌బాబుకు టీడీపీతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ జగన్‌తో కలిసి ఉండాల్సి రావడంతో న్యూట్రల్ గా మారారు. ఇది పెద్ద విషయం కాదు, కానీ కోర్టు కేసు కారణంగా, ఈ కేసు పరిష్కారమయ్యే వరకు ఏ చిత్రానికి టికెట్ రేటు పెంచకూడదని షరతు ఉండడంతో “ఇండియన్-2” ఏపీలో సాధారణ టికెట్ రేటుతో విడుదల కానుంది. మరి ఇది సినిమా కలెక్షన్స్ పై ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.