Palnadu Ycp: 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన ఫ్యాన్ పార్టీ కష్టకాలంలో ఉంది. గుంటూరు జిల్లాలో ఘోరంగా ఓటమి చెందిన వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో జిల్లాలో పార్టీ పగ్గాలు అందుకునేది ఎవరు… సారధ్య బాధ్యతలు స్వీకరించి సమరశంఖం పూరించేది ఎవరు…. అనే చర్చ జోరుగానే సాగుతోంది. పల్నాడు పౌరుషాల గడ్డపై ఫ్యాన్ గాలి వీచేలా చేసేది ఎవరంటూ పార్టీ వర్గాల్లోనే టాక్ నడుస్తుందట. వైసీపీ కార్యకర్తలు అంతా అటువంటి నేత కోసమే ఎదురు చూస్తున్నారట. అయితే అధిష్టానం వెంటనే అటువంటి నేతను ఎంపిక చేస్తుందా అన్న అనుమానం కూడా కార్యకర్తల్లో వ్యక్తం అవుతుందట. Palnadu Ycp
Palnadu Ycp Macherla out Who is the Palnadu potugad of mens land
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ రీజనల్ ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల్లో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేయడం…. మాజీ ఎమ్మెల్యే పిఆర్కె రిమాండ్ కు వెళ్లడం జరిగింది. ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీని ముందుండి నడిపించేది ఎవరని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతుంది. Palnadu Ycp
Also Read: Jagan: జగన్ పై కడప ఎంపీఅవినాష్ తిరుగుబాటు ?
సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేయాల్సి ఉంది. ఇప్పటికే అధికార ప్రతినిధిగా తన వాయిస్ ను అంబటి వినిపిస్తున్నారు. ఇక పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయిన నేతలు నంబూరి శంకర్ రావు, బొల్లా బ్రహ్మనాయుడులు తమ వ్యాపారాలపై దృష్టిని సారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ పార్టీ పగ్గాలు అందుకోవడానికి ముందుకు వస్తారా అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇక చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహించిన విడుదల రజిని గుంటూరు వెస్ట్ కు మారి అక్కడ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దీంతో అక్కడ నుంచి పోటీ చేసిన కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్ సీటులో తిరిగి కూర్చున్నారు. Palnadu Ycp
ఆ నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు ఎవరా అన్నది ఇంకా తేలలేదని చెప్పవచ్చు. ఇక నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురజాలకు గతంలో ప్రాతినిధ్యం వహించిన కాసు మహేష్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా గోపిరెడ్డి వెళ్లి పరిశీలించారు. అటు కాసు మహేష్ కూడా పార్టీ ఓటమిపై విశ్లేషణ చేస్తామనిచెబుతున్నారు . దీంతో కాసు మహేష్ గోపిరెడ్డిల్లో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. ఇక వీరిద్దరూ కూడా పార్టీ సారధ్య బాధ్యతలు అందుకోవడానికి ఎవరు ముందుకు వస్తారో అని చూడాల్సి ఉంది. Palnadu Ycp