Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ అద్భుతమైన శతకం.. ప్రముఖుల ప్రశంశలు!!

Nitish Kumar Reddy Brilliant Test Century

Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుతమైన శతకంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన నితీశ్, జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ పిచ్ లను కఠినతను ఎదుర్కొని తన మొదటి టెస్టు సెంచరీ సాధించాడు.

Nitish Kumar Reddy Brilliant Test Century

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నితీశ్ కుమార్ రెడ్డి సాధించిన ఘనతను ప్రశంసించారు. “మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టులో తెలుగు యువకుడు నితీశ్ కుమార్ రెడ్డి సాధించిన శతకం గొప్పగానూ గర్వకారణంగానూ నిలిచింది. టెస్టు క్రికెట్‌లో సెంచరీ సాధించిన మూడో అతి పిన్న వయస్కుడిగా నిలవడం మరింత ప్రత్యేకత. రంజీలో ఆంధ్రా తరఫున సత్తా చాటిన నితీశ్, అండర్-16లోనూ అద్భుతమైన విజయాలు సాధించాడు. ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించి భారత జట్టుకు మరిన్ని గౌరవాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

తెలుగు సినీ రంగ ప్రముఖుడు విక్టరీ వెంకటేశ్ కూడా నితీశ్ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. “అతని ఆట తీరును చూసి గర్వంగా ఉంది. 8వ స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం జట్టుకు కీలకంగా నిలిచింది. తొలి టెస్టు సిరీస్‌లోనే ఇలాంటి ప్రదర్శన నితీశ్ కెరీర్‌లో మంచి ఆరంభాన్ని ఇచ్చింది” అని వెంకటేశ్ వ్యాఖ్యానించారు.

నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుత ఆటతీరుతో తెలుగు రాష్ట్రాల కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటాడు. ఆస్ట్రేలియా పిచ్‌లలో బ్యాటింగ్ చేయడం అంత సులభం కానప్పటికీ, తన సత్తాను నిరూపించి, యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. తన ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా భారత క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటూ, దేశానికి మరింత గౌరవం తీసుకురావడం గర్వకారణం. ఇది కేవలం అతని కెరీర్‌కు కాకుండా, భారత క్రికెట్‌కు కూడా ఒక విలువైన మైలురాయి.

https://twitter.com/Smokyy_007/status/1872894551503093902

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *