Keerthy Suresh: కీర్తి సురేష్ ని టార్చర్ చేస్తున్న మీడియా.. అంత అవమానమా.?
Keerthy Suresh: రీసెంట్గా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తను బాలీవుడ్ లో మొదటిసారి నటించిన బేబీ జాన్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ కీర్తి సురేష్ అంచనాలను బేబి జాన్ మూవీ అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బేబీ జాన్ మూవీ పుష్ప-2 సినిమా ముందు తేలిపోయింది. బాలీవుడ్ లో పుష్ప టు హడావిడి మామూలుగా లేదు.ఇక పుష్ప టు హవా ముందు బేబీ జాన్ మూవీ కలెక్షన్లు కూడా ఎక్కువగా రాకుండా చతికిలపడిపోయింది అని చెప్పుకోవచ్చు.
The media is torturing Keerthy Suresh
అయితే ఈ సినిమా కారణంగా కీర్తి సురేష్ కి ఒరిగిందేమీ లేదు. కీర్తి సురేష్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమానే ప్లాఫ్ అని కీర్తి సురేష్ పై ఇప్పటికే ఎన్నో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఓ పక్క ట్రోల్స్ పాలవుతూ నెట్టింట్లో వైరల్ గా నిలుస్తుంటే తాజాగా బాలీవుడ్ మీడియా కీర్తి సురేష్ ని దారుణంగా అవమానించింది.కీర్తి అనే పేరుని కృతి,కీర్తి దోసె అంటూ పిలిచి తెగ చిరాకు తెప్పించారు.(Keerthy Suresh)
Also Read: Samantha: ఏంటి సమంత ప్రెగ్నెంటా..వైరల్ అవుతున్న బేబీ బంప్..?
అయితే తాజాగా బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పాల్గొన్న సమయంలో ఆమెకు చాలా అవమానం జరిగింది.. బేబీ జాన్ ప్రెస్ మీట్ లో భాగంగా కీర్తి సురేష్ ని అక్కడ ఉన్న మీడియా రిపోర్టర్లు కీర్తి సురేష్ అని పిలవకుండా కృతి అని పిలిచారు. అయితే పదే పదే కీర్తి సురేష్ నా పేరు కృతి కాదు కీర్తి అని చెప్పినా కూడా వినలేదు.అలాగే మరికొంతమంది కీర్తి దోసె అంటూ అవమానంగా మాట్లాడారు.
ఇక వాళ్ళు ఎంత అవమానించినా కూడా కీర్తి సురేష్ చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చి నా పేరు కీర్తి దోసె కాదు.. కీర్తి సురేష్ అలాగే నాకు దోష అంటే కూడా ఎంతో ఇష్టం అంటూ వారికి సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం కీర్తి సురేష్ ని మీడియా రిపోర్టర్లు టార్చర్ చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.(Keerthy Suresh)