Actresses Turn Producers: అందాలలోనే కాదు.. అందులోనూ దూసుకుపోతున్న అందాల భామలు!!
Actresses Turn Producers: తెలుగు సినిమా పరిశ్రమలో, మహిళా నటీమణుల పాత్రలు కేవలం కెమెరా ముందు నటించడం మాత్రమే కాకుండా, ఇప్పుడు కెమెరా వెనుక కూడా పెరిగిపోయాయి. గతంలో పురుషులకే పరిమితమైన అనుకుంటున్న సినిమాల నిర్మాణ రంగంలో, ఈ రోజుల్లో అనేక టాలెంటెడ్ మహిళలు తమ సొంత నిర్మాణ సంస్థలను స్థాపించి, ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌గా మారింది.
Telugu Film Actresses Turn Producers Now
కొన్ని సంవత్సరాల క్రితం, సినిమా నిర్మాణం అనేది కేవలం పురుషులకే సంబంధించి ఉండటంతో, మహిళలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం అరుదుగా కనిపించేది. కానీ, నేటి కాలంలో, తెలుగు సినిమా పరిశ్రమలో అనేక మహిళా నటీమణులు తమ సొంత బ్యానర్లను స్థాపించి, సినిమాలు నిర్మిస్తున్నారు. వీరు కేవలం నిర్మాతలుగా మాత్రమే కాకుండా, దర్శకులు, కథా రచయితలుగా కూడా పనిచేస్తున్నారు. నిహారిక కొణిదెల, ఛార్మీ కౌర్, తాప్సీ, నయనతార, నిత్యా మీనన్, అమలాపాల్ వంటి ప్రముఖ నటీమణులు ఈ రంగంలో సత్తా చాటుతున్నారు.
నిహారిక కొణిదెల: మెగా కుటుంబానికి చెందిన నిహారిక, ‘పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది. ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘కమిటీ కుర్రొళ్లు’ వంటి చిత్రాలను నిర్మించింది.
ఛార్మీ కౌర్: పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘ఛార్మీ మూవీ మేకర్స్’ బ్యానర్‌ను స్థాపించి, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘లైగర్’, ‘డబుల్ ఈస్మార్ట్’ వంటి చిత్రాలను నిర్మించింది.
తాప్సీ: బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ప్రసిద్ధి చెందిన తాప్సీ, ‘ఔట్ ఆఫ్ ది బాక్స్’ కథలను ఎంచుకుని ‘బ్లర్ర్’ అనే చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
నయనతార: లేడీ సూపర్ స్టార్ నయనతార, భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌ను స్థాపించింది.
నిత్యా మీనన్: ‘స్కైలాబ్’ అనే చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది, ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
అమలాపాల్: ‘కడవర్’ అనే ఫోరెన్సిక్ థ్రిల్లర్‌తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.