Allu Arjun Arrest: అల్లు అర్జున్ ను పట్టించుకోని పవన్ కళ్యాణ్.. సినిమా కంటే పెద్ద విషయాలంటూ ఆగ్రహం!!
Pawan Ignores Allu Arjun Arrest: ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు చర్చలు జరిగాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్‌ను ఆపి, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా అతని ఇంటికి వెళ్లారు. అరెస్ట్ తర్వాత మరుసటి రోజు అల్లు అర్జున్ విడుదలవడంతో, చిరంజీవి మరియు నాగబాబు ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. అయితే, ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ రానున్నారు అనే వార్తలు వచ్చినప్పటికీ, ఆయన అక్కడ రాలేదు.
Diputy CM Pawan Ignores Allu Arjun Arrest
తాజాగా, పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో ఉన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ, ఎంపీడీవో మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఒక మీడియా పర్సన్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించాలని కోరగా, పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఈ సందర్భానికి సంబంధించి సంబంధిత ప్రశ్నలు అడగండి. ఇక్కడ ప్రజలు చచ్చిపోతే, సినిమా గురించి మాట్లాడుతారా? కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి. సినిమాల కంటే పెద్ద విషయాలు ఉన్నాయి’’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో ఈ ఘటనపై మిశ్రమ స్పందన ఉంది. “పుష్ప 2” ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు, అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి, ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌తో విడుదల చేశారు. ఈ పరిణామాలపై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా స్పందించింది. మెగా కుటుంబం, దిల్ రాజు, ఇతర సినీ ప్రముఖులు ఈ ఘటనను చక్కదిద్దేందుకు పలు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు లేకుండా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ నిర్ణయం తర్వాత, సినీ ప్రముఖులు ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు రంగంలోకి దిగి, పరిస్థితే మారినట్లు సమాచారం వచ్చింది. అల్లు అరవింద్, శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయల పరిహారం ప్రకటించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే, అల్లు అర్జున్‌పై కేసు ఇంకా కొనసాగుతుందని తెలుస్తోంది.