Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లికి ముందే ప్రెగ్నెంటా.. బేబీ బంప్ ఫోటోస్ వైరల్.?
Keerthy Suresh: సినిమాల్లో పాపులర్ అయిన నటీనటులకు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక సెగ తగులుతూనే ఉంటుంది.. కొంతమేరకు సోషల్ మీడియాలో చెప్పేవి నిజాలైతే, ఎక్కువ శాతం అబద్ధాలు ఉంటాయి.. ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పుకార్లే వారి జీవితాల్లో విషాదాలను కూడా నింపుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల వల్ల చాలామంది హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం.
Keerthy Suresh Pregnant Before Marriage
అయితే తాజాగా అదే కోవలోకి హీరోయిన్ కీర్తి సురేష్ కూడా చేరిపోయింది.. దాదాపు ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటిన కీర్తి సురేష్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంది. అయితే మహానటి సినిమాకు ముందు ఈమె పేరు ఎక్కువగా పాపులర్ కాలేదు. ఎప్పుడైతే మహానటి సినిమాలో నటించిందో అప్పటినుంచి కీర్తి సురేష్ అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. ఆ తర్వాత ఈమెకు అనేక ఆఫర్లు వచ్చి మంచి ఫామ్ లో దూసుకుపోతోంది. (Keerthy Suresh)
Also Read: Rana-Dulquer Salmaan: రానా-దుల్కర్ సల్మాన్ మధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్..?
అలాంటి ఈ అందాల ముద్దుగుమ్మ డిసెంబర్ 14వ తేదీన గోవాలో తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి ఆంటోని తటిల్ ను వివాహం చేసుకుంది. అయితే ఈమె పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో మరియు హిందూ సంప్రదాయం ప్రకారం ఇలా రెండు పద్ధతుల్లో పెళ్లి చేసుకుంది.. ఇక ఈమె పెళ్లయి కనీసం నెలరోజులైనా గడవకముందే ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది వార్తలు క్రియేట్ చేశారు. అంతేకాదు ఆమె బేబి బంప్ తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి ఆశ్చర్య పరుస్తున్నారు.
దీంతో అది చూసిన నెటీజన్స్ షాక్ అయిపోతున్నారు. పెళ్లయి నెల రోజులు కూడా గడవకముందే అంత పెద్ద పొట్ట ఎలా వచ్చింది అంటూ షాక్ అవుతున్నారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని ఇది ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేశారని కొట్టిపారేస్తున్నారు. ఇక ఏఐ టెక్నాలజీ గురించి తెలియని వారు కీర్తి సురేష్ పెళ్లికి ముందే ఆయనతో కాలుజారి ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఇంత హడావిడిగా పెళ్లి చేసుకుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఆ ఫోటోలు మాత్రం నెట్టింటా తెగ రచ్చ చేస్తున్నాయి.(Keerthy Suresh)