Prashanth Varma: అమృత అయ్యర్ ని టార్చర్ చేసిన ప్రశాంత్ వర్మ.. షూటింగ్లోనే అది కావాలని.?

Prashanth Varma: అమృత అయ్యర్..ఈ పేరు వినగానే చాలామందికి హనుమాన్ మూవీ నే గుర్తుకొస్తుంది. అయితే ఈ సినిమాలో నటించక ముందు అమృత అయ్యర్ పేరు ఎవరికి అంతగా తెలియదు.కానీ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. అయితే దీనంతటికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని చెప్పుకోవచ్చు. ఆయన క్రియేటివిటీ తో ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకువెళ్లారు.

Prashanth Varma who tortured Amrita Iyer

Prashanth Varma who tortured Amrita Iyer

ముఖ్యంగా తక్కువ బడ్జెట్ పెట్టి హాలీవుడ్ రేంజ్ లో హనుమాన్ మూవీ కి విజువల్స్ ఇచ్చి తన డైరెక్షన్ తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు ప్రశాంత్ వర్మ. ఇక హనుమాన్ మూవీ ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో మొదటి ప్లేస్ ఉంది. అయితే అలాంటి హనుమాన్ మూవీ హీరోయిన్ అమృత అయ్యర్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రశాంత్ శర్మ గురించి షాకింగ్ పోస్ట్ పెట్టింది. (Prashanth Varma)

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ ని టార్చర్ చేస్తున్న మీడియా.. అంత అవమానమా.?

అయితే ఆ పోస్టులో ఏముందంటే..రీసెంట్గా బాలకృష్ణ తన కొడుకు మొదటి సినిమాకి డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మని తీసుకున్నాక డైరెక్షన్ చేయను కథ మాత్రమే అందిస్తాను అని ప్రశాంత్ వర్మ చెప్పడంతో బాలకృష్ణకి ప్రశాంత్ వర్మ కి మధ్య విభేదాలు వచ్చి బాలకృష్ణ ప్రశాంత్ వర్మని కొట్టారంటూ ఓ రూమర్ వినిపించింది. అయితే ఆ రూమర్ కి సంబంధించిన ఒక మీమ్ ని తన సోషల్ మీడియా ఖాతాలో అమృత అయ్యర్ షేర్ చేసింది.

Prashanth Varma who tortured Amrita Iyer

దీంతో ఆ మీమ్ చూసి చాలామంది తనకి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా డైరెక్టర్ కి సంబంధించి అలాంటి మీమ్ అమృత ఎందుకు పోస్ట్ చేసింది..ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అంటూ సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే షూటింగ్ సెట్లో అమృత అయ్యర్ ని ప్రశాంత్ వర్మ ఏ విషయంలోనైనా ఇబ్బంది పెట్టారు కావచ్చు. ఆ టార్చర్ గుర్తుపెట్టుకుని అమృత ప్రశాంత్ వర్మపై ఈ విధంగా పగ తీర్చుకుంటుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Prashanth Varma)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *