Turmeric: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో కలుషిత వాతావరణం కారణంగా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అంతేకాకుండా వీటికి అనేక రకాల మందులు వాడుతూ అనవసరంగా డబ్బులను ఖర్చు చేసుకుంటున్నారు. మన వంటింట్లో ఉండే వివిధ రకాల వస్తువులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మన ఆరోగ్యాన్ని సంరక్షించే వాటిలో పసుపు చాలా ముఖ్యమైనది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు ఆయుర్వేద ఔషధంగా వాడుతారు. Turmeric
Health Benfits With Turmeric
ప్రతి ఒక్క ఆహారంలో తప్పకుండా పసుపును వేసుకుంటాం. పసుపును తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దానివల్ల వైరల్ జ్వరాలు, అంటువ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు అన్ని తొలగిపోతాయి. కానీ పసుపుని అధికంగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నివేదికలో వెళ్లడైంది. అందులో భాగంగానే పసుపుని ఎక్కువగా తినడం వల్ల వికారం వంటి సమస్యలు వస్తాయి. తద్వారా పసుపును తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. Turmeric
Also Read: Kcr: కేసీఆర్ కు బిగ్ షాక్.. 9 మంది ఎమ్మెల్యేలు జంప్.. ఇక కాంగ్రెస్ లో BRS విలీనమే?
రోజువారి ఆహారంలో పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలో మంట, అల్సర్, గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా పసుపు ఎక్కువగా తినడం వల్ల కడుపునొప్పి సమస్య కూడా వస్తుంది. కావున పరిమిత మోతాదులో తీసుకోవాలి. జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు వేడి నీళ్లు కాచుకొని అందులో కాస్త పసుపు వేసుకొని ఆవిరి పట్టినట్లయితే జలుబు చిటికెలో మాయమవుతుంది. Turmeric
ఇక అంతేకాకుండా పసుపు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. చాలామంది స్త్రీలు ముఖానికి పసుపుని రాసుకుంటూ ఉంటారు. దానివల్ల మొటిమలు వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. పసుపు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో చక్కగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ దానిని కేవలం పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Turmeric