Team India: 2024లో ఇండియా గెలిచిన ట్రోఫీలు, విజయాలు ?
Team India: 2024లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి భారత పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టిస్తోంది. ఒలింపిక్స్ లో భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పథకాలతో సహా ఆరు పథకాలను సొంతం చేసుకుంది. రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టైటిల్ విజేతగా నిలిచి పురుషుల డబుల్స్ లో మొదటిసారిగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. Team India
Trophies and victories won by India in 2024
పారాలింపిక్స్ లో రెండు స్వర్ణాలు సాధించిన తొలి భారతీయ మహిళగా అవని లేఖరా నిలిచింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC) లో విజయం సాధించిన మొదటి భారతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ గా పూజ తోమర్ నిలిచారు. ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ లో భారత్ కు మొదటిసారిగా పథకాన్ని అందించి భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు చరిత్ర సృష్టించింది. Team India
Also Read: Nitish Kumar Reddy: నితీష్ ఫేవరేట్ హీరో ఎవరు.. ప్రియురాలు ఆమేనా ?
కేవలం 18 సంవత్సరాల వయసులో డింగ్ లిరెన్ పై అద్భుతమైన విజయం సాధించిన తర్వాత డి గుకేష్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. పురుషుల హాకీలో కాంస్య పథకాన్ని క్లేయిమ్ చేసిన తర్వాత 2024 ఒలింపిక్స్ లో భారతదేశం ఒక చారిత్రాత్మక ఫీట్ ను నమోదు చేసుకుంది. కోనేరు హంపి న్యూయార్క్ లో 2024 ప్రపంచ రాపిడ్ ఛాంపియన్షిప్ ను గెల్చుకుంది. Team India