Power Save: కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా ఇలా చేయండి ?
Power Save: సాధారణ బల్బుకు బదులుగా తక్కువ శక్తి బల్బును వాడాలి. సిఎఫ్ఎల్ లేదా ఎల్ఈడీ లైట్లు ఉపయోగించడం వల్ల 70% వరకు విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. ఫ్రిజ్ లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోయినట్లయితే దాని కారణంగా ఫ్రిడ్జ్ కూలింగ్ పవర్ తగ్గిపోయి ఎక్కువగా విద్యుత్ ఖర్చు అవుతుంది. ఫ్రీజర్ ను ఎల్లప్పుడు డీఫ్రాస్ట్ గా ఉంచుకోవాలి. Power Save
How To Save Power Bill
వేడి ఆహారాన్ని కొంచెం చల్లబడిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. టీవీ, లాప్టాప్, మొబైల్ చార్జర్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించిన తర్వాత కచ్చితంగా వాటి పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఏసీని మార్చినట్లయితే ఇంటి కిటికీలు, తలుపులు, స్కై లైట్లు మొదలైనవన్నీ సరిగ్గా మూసి ఉండేలా చూసుకోవాలి. Power Save
Also Read: Money Plant Astro Tips: ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి.. ఏ దిక్కులో పెట్టాలి ?
అవసరమైతే ఎయిర్ కండిషనర్ కి బదులుగా సీలింగ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ ఉపయోగించడం వల్ల విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. కంప్యూటర్ తో పనిచేసిన తర్వాత ఎల్లప్పుడూ పవర్ స్విచ్ ను ఆఫ్ చేయాలి. విరామం తీసుకుంటే మానిటర్ ను ఆఫ్ చేయాలి. కంప్యూటర్ ను ఎక్కువ సేపు స్లీప్ మోడ్ లో ఉంచకూడదు. అందుకు బదులుగా కంప్యూటర్ ను షట్ డౌన్ చేయడం మంచిది. Power Save