Pumpkins: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కలుషితం లేని ఆహారాన్ని తిని చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అంతేకాకుండా చాలా సంవత్సరాలు బతికేవారు. కానీ నేటి కాలంలో కలుషితమైన ఆహారాన్ని తిని ప్రతి ఒక్కరూ వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అందులో భాగంగానే పూర్వకాలం నుంచి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే గుమ్మడికాయ కూడా ఒకటి. ఈ గుమ్మడికాయను చాలా తక్కువమంది తింటారు. Pumpkins
Pumpkins Health benefits and nutritional breakdown
కానీ గుమ్మడికాయను వారంలో ఒక్కసారైనా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా కంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా కంటి చూపు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు తొలగిపోతాయి. గుమ్మడికాయను కూర వండుకొని తినడం వల్ల గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. తద్వారా రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. ఇక గుమ్మడికాయ కూర తినడం వల్ల బరువు కూడా చాలా సులభంగా తగ్గుతారు. ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. Pumpkins
Also Read: Bandi Sanjay: బీజేపీ పార్టీలోకి హరీష్ రావు?
అంతేకాకుండా ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ గుమ్మడికాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఏర్పడే అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతుంది. గుమ్మడికాయలు యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ విపరీతంగా ఉంటాయి. తద్వారా అనేక రకాల వ్యాధి గురించి కాపాడుతుంది. ఈ గుమ్మడికాయతో స్వీట్ కూడా చేసుకొని తింటారు. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడికాయ ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది. వారంలో ఒక్కసారైనా గుమ్మడికాయ కూర తినాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Pumpkins
కానీ గుమ్మడికాయను రెండు మూడుసార్లు తిన్నట్లయితే కాస్త అనారోగ్యం కూడా వస్తుందని చెబుతున్నారు. ఇక అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పచ్చి గుమ్మడికాయను తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. పచ్చి గుమ్మడికాయ తినడం వల్ల అది అరగడానికి చాలా సమయం పడుతుంది. తద్వారా కడుపునొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అందుకే గుమ్మడికాయని కేవలం కూర వండుకుని మాత్రమే తినాలి. పచ్చి గుమ్మడికాయ అస్సలు తినకూడదని వైద్య నివేదికలో వెళ్లడైంది. Pumpkins