Balakrishna: రష్మిక పెళ్లి ఎప్పుడో లీక్ చేసిన బాలకృష్ణ..?
Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ అంటే ఎంతటి అభిమానాలు ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన కేవలం హీరో గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ అయ్యారు. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు ఇంకోవైపు ఓటిటి షోలను చేస్తూ కుర్ర కారుకు పోటీ ఇస్తున్నారు. అలాంటి బాలకృష్ణ హోస్ట్ గా చేసే ఆహా ఓటీటీలో వచ్చే అనుష్టాపబుల్ షో అందరికీ తెలుసు. ఈ షోకి ఆయన సినీ ప్రముఖుల అందరిని పిలుస్తూ వారి బయోడేటాను లాగుతూ అందరిని అలరిస్తూ ఉంటాడు. తాజాగా ఈ షోకి డాకు మహారాజు చిత్ర యూనిట్ వచ్చారు.
Did Balakrishna ever leak Rashmika wedding
ఈ సందర్భంగా మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ, దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హాజరయ్యారు. వీరందరితో బాలకృష్ణ చాలా అద్భుతంగా మాట్లాడి అందరిని ఆటపట్టించారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ముందుగా ఈ షోలోకి దర్శకుడు బాబి రాగానే ఏంటండీ డైరెక్టర్ గారు చొక్కా మీద చొక్కా వేశారని బాలకృష్ణ అడుగగానే ఆ స్టేజ్ పై సౌండ్ తో పాటు లైట్స్ ఆఫ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇదేంటి ఇలా అవుతుంది అనే లోపే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వస్తారు (Balakrishna)
Also Read: Mamitha Baiju:’ప్రేమలు’ హీరోయిన్ ని టార్చర్ చేసిన డైరెక్టర్.. దాని కోసం షూటింగ్లోనే.?
దీంతో ఫస్ట్ టైం థియేటర్లలో స్పీకర్లు పడిపోయాయి అంటే అది మీ సినిమా అంటారు. దీనికి బదులుగా బాలకృష్ణ డైలాగ్ చెబుతూ స్పీకర్ల కెపాసిటీ పెంచండి డాకు మహారాజ్ వస్తుంది అనడంతో అక్కడున్న ప్రేక్షకులంతా ఖుషి అవుతారు. ఈ విధంగా సాగుతున్న సందర్భంలో హీరోయిన్ తమన్నా మరియు రష్మిక మందాన గురించి మాట్లాడతారు. ఈ సందర్భంలోనే బాలకృష్ణ నాకు రష్మిక అంటే ఎంతో ఇష్టం, కానీ ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిందట కదా అంటూ చాలా డల్ గా అంటారు. వెంటనే నాగ వంశీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోని ఆమె లవ్ చేస్తోంది కానీ పేరు మాత్రం బయటికి చెప్పడం లేదు,
కనీసం బాలకృష్ణ పేరు అయినా చెప్పొచ్చు కదా వెబ్సైట్స్ కైనా పనికొస్తుంది అంటూ నాగవంశీ నవ్వులు పూయిస్తారు. వెంటనే బాలకృష్ణ ఊర్వశి రౌటేల మీద మీ అభిప్రాయం ఏంటని నాగవంశీని అడగగానే, ఇప్పుడు చెబితే మా ఆవిడతో గొడవలు వచ్చేస్తాయి అంటూ సమాధానం ఇస్తారు. ఈ విధంగా వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా కామెడీగా ఆసక్తికరంగా సాగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా రష్మిక పెళ్లి గురించి బాలకృష్ణ మాట్లాడడంతో అది మరింత వైరల్ అవుతుంది. రష్మిక పెళ్లి ఎవరితో జరుగుతోంది అంటూ అసలు ఆ పూర్తి వీడియోలో ఏం రాబోతుంది అంటూ నేటిజన్లు వెయిట్ చేస్తున్నారు.(Balakrishna)