Naga Chaitanya: ఆ హీరోయిన్ కోసం పస్తులున్న నాగచైతన్య.?
Naga Chaitanya: ఏంటి నాగచైతన్య మరో హీరోయిన్ కోసం పస్తులున్నారా.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆయన ఆ హీరోయిన్ కోసం ఎందుకు కడుపు మాడ్చుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం .. నాగా చైతన్య 30 ఏళ్లు దాటినా కూడా 20 ఏళ్ల కుర్రాడిలాగే కనిపిస్తారు. ఇక ఈ అందమంతా నాగార్జున తోనే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి నాగచైతన్య తన అందాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం ఎన్నో డైట్ ప్లాన్లు చేసుకుంటారట.
Naga Chaitanya stopped eating for that heroine
ఆయన ఫుడ్ చాలా తక్కువ మోతాదులో తింటారట. అలాగే జిమ్ లో ఎక్కువగా కష్టపడతారని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రతిరోజు డైట్లో చాలా తక్కువ ఫుడ్ ఎక్కువ ఫైబర్ కేలరీలు ఉండేలా చూసుకుంటారట. ఇక రోజు తినే ఫుడ్ లో కచ్చితంగా ఫిష్ లేదా చికెన్ కచ్చితంగా ఉండాలి అని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. (Naga Chaitanya)
Also Read: Prabhas: ప్రభాస్ కి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఆ డైరెక్టర్.. ఫ్యూచర్లో సినిమాలు చేయలేడా.?
అలాగే ప్రతిరోజు తినేటప్పుడు కొలతలు ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా మెయింటైన్ చేస్తారని, ఈ కారణంగానే డైట్ కచ్చితంగా ఫాలో అవ్వగలుగుతున్నాను అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు. అయితే నాగచైతన్య డైట్ ప్లాన్ కచ్చితంగా పాటించడానికి కారణం సాయి పల్లవి అని,సాయి పల్లవి వల్లే నాగచైతన్య ఫిట్ గా ఉండేలా ప్లాన్ వేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఎందుకంటే ప్రస్తుతం సాయి పల్లవితో నాగచైతన్య తండేల్ మూవీలో చేస్తున్నారు.ఈ సినిమాలో సాయి పల్లవి నటన తో పాటు ఆమె అందానికి మ్యాచ్ అవ్వాలంటే నాగచైతన్య కూడా ఎంతో కొంత డైట్ చేస్తూ ఉండాలి. అలాగే బాగా లావుగా ఉంటే కూడా సెట్ అవ్వరు. ఈ కారణం వల్లే నాగచైతన్య డైట్ ని సీరియస్ గా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.అలా సాయి పల్లవి కారణంగా నాగచైతన్య పస్తులున్నారు అంటూ ఒక రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.(Naga Chaitanya)