Potatoes: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇంటి ఆహారాన్ని తినేవారు వారంలో ఒక్కసారైనా బంగాళాదుంపలను తింటారు. అవి రుచి చాలా బాగుంటుంది. అంతేకాకుండా అవి తక్కువ ధరకే వస్తాయి. అందువల్లనే వీటిని కొనడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే చాలామంది వీటిని ఒకేసారి ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఇంట్లో నిల్వ చేసుకుంటారు. దానివల్ల బంగాళదుంపలపై మొలకలు వస్తాయి. అయితే ఈ మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Potatoes
Eating sprouted potatoes
అయితే అలా మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినకూడదని…. అంతేకాకుండా ఆకుపచ్చ రంగులో ఉండే వాటిని కూడా తినకూడదని అంటున్నారు. ఇలాంటి వాటిని తినడం వల్ల అందులో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. తద్వారా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అలాంటి వాటిని తినడం వల్ల విషంగా మారే అవకాశం ఉంటుంది. Potatoes
Also Read: Jagan: జగన్ కు ఎదురుదెబ్బ… TDPలోకి వైసీపీ ఎంపీలు ?
ఇక కొంతమందికి వికారం, వీరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇక బంగాళదుంపలను థైరాయిడ్, బిపి, షుగర్ పేషెంట్లు అసలు తినకూడదు. బంగాళదుంపలలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వీటీని తినడం షుగర్ పేషంట్లకు అస్సలు మంచిది కాదు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, వాతం వంటి సమస్యలతో బాధపడేవారు బంగాళదుంపలను తినకూడదు. Potatoes
బంగాళాదుంపలను తినడం వల్ల ఆరోగ్యానికి పెద్దగా ప్రయోజనాలు ఉండవు. కేవలం రుచికి మాత్రమే వీటిని తింటారు. ఈ బంగాళదుంపలను వేపుడు, చిప్స్, ఆలు కుర్మా ఇంకా వివిధ రకాలుగా తయారు చేసుకుని తింటారు. ఎప్పుడో ఒకసారి వీటిని తింటే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ అదే పనిగా వారానికి రెండుసార్లు తిన్నట్లయితే అనేక రకాల సమస్యలు వస్తాయి. Potatoes