Venu Swamy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక నాకు బుద్ధి వచ్చింది అన్నట్లు ఓ వీడియో రిలీజ్ చేసి ఇప్పటినుండి నేను ఎవరి పర్సనల్ విషయాలు కూడా బహిరంగంగా మాట్లాడను అంటూ క్షమాపణలు అడిగినా రేంజ్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు వేణు స్వామి. ఇక తర్వాత అందరూ వేణు స్వామి పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. అయితే మళ్లీ వేణు స్వామి జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టేశారు.
Venu Swamy confirmed the divorce of that heroine in 6 months
రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ..నేను చెప్పిన విషయాలు 90% నిజమయ్యాయి.ఓ 10% ఎక్కడో తప్పాయి. నన్ను ట్రోల్ చేసేవారు చేసుకొని నాకు ఎలాంటి భయం లేదు. అలాగే మరో ఆరు నెలల్లో ఆ హీరోయిన్ కచ్చితంగా విడాకులు తీసుకుంటుంది. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. ఇక ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నాని ని పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. (Venu Swamy)
Also Read: Divorce: చైతూ-సామ్, ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటారని ముందే చెప్పిన స్టార్ హీరో.?
అవును మీరు వినేది నిజమే.నేను వీళ్ళ పెళ్ళికి ముందే చెప్పాను రకుల్ కి పెళ్లి జీవితం కలిసి రాదని, వివాహం చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటుందని. కానీ నేను చెప్పినా వినకుండా ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంది.పెళ్లి చేసుకున్నాక కచ్చితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పాను. ఇక నేను చెప్పినట్లే ఆమె భర్త మూవీ బ్యానర్ కష్టాల్లో కూరుకుపోయింది. అలాగే ఆ బ్యానర్ లో చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అవుతున్నాయి.అలాగే ఆమె తమ్ముడు రీసెంట్ గా డ్రగ్స్ కేసులో కూడా పట్టుబడ్డాడు.
ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంతేకాదు మరో ఆరు నెలల్లో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వేణు స్వామి పెద్ద బాంబు పేల్చారు.దీంతో చాలామంది ఈయన మాటలు విన్న నెటిజన్స్ వేణు స్వామికి ఇంత జరిగినా బుద్ధి రాలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు నిజమే అయితే ఓకే గానీ ఒకవేళ ఆరు నెలల్లో రకుల్ విడిపోకపోతే మాత్రం వేణు స్వామి పై ట్రోలింగ్ మామూలుగా ఉండదు అంటున్నారు మరికొంతమంది జనాలు.(Venu Swamy)