Mahesh-Namrata: టాలీవుడ్ స్టార్ హీరో అయినా మహేష్ బాబు నమ్రత తమ పెళ్లిని ఎంత సింపుల్గా చేసుకున్నారో చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా వీరి పెళ్లి ఫొటోస్ చూసి చాలా మంది జనాలు అంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయిన వీళ్లు ఎందుకు అంత సింపుల్గా ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు అని షాక్ అవుతారు. అయితే వీరి పెళ్లి అంత సింపుల్గా సీక్రెట్ గా చేసుకోవడానికి ఓ వ్యక్తి కారణమయ్యారట.. ఆమె తమ పెళ్లి ఎక్కడ చెడగొడుతునందోనని భయపడి సీక్రెట్ గా సింపుల్ గా కానిచ్చేశారట.
Mahesh-Namrata wedding was done secretly because
మరి ఇంతకీ మహేష్ బాబు,నమ్రతల పెళ్లి చెడగొట్టాలని చూసింది ఎవరు అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదు మహేష్ బాబు అమ్మమ్మ ఇందిరా దేవి తల్లి దుర్గమ్మ.. అవును ఈ విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.అయితే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు పెళ్లి ఎందుకు అలా జరిగింది అని ఇంటర్వ్యూవర్ అడగగా.. మహేష్ బాబు అమ్మమ్మ దుర్గమ్మకు భయపడి అలా రహస్యంగా ముంబైలో పెళ్లి చేసాం.(Mahesh-Namrata)
Also Read: Gopichand: జయం సినిమాలో గోపీచంద్ నటించిన పాత్ర కు చిన్నప్పటి రోల్ లో నటించిందెవరో తెలుసా?
ఎందుకు అని అడగగా ఎందుకంటే మహేష్ బాబు అమ్మమ్మకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నమ్రతను పెళ్లి చేసుకోవడానికి మహేష్ బాబు అమ్మమ్మ ఒప్పుకోలేదు.ఈ కారణం చేతనే మహేష్ బాబు పెళ్లి సీక్రెట్ గా సింపుల్ గా ముంబైలో చేయవలసి వచ్చింది అంటూ విజయనిర్మల చెప్పింది.అయితే మహేష్ బాబు నమ్రతల పెళ్లి ఆపాలని మహేష్ బాబు అమ్మమ్మ ఎంతగానో ట్రై చేసింది.దాంతో కుటుంబ సభ్యులు అందరూ భయపడి పెళ్లిని రహస్యగా ఉంచాం.
అయినప్పటికీ పెళ్లి జరుగుతుంది అనే విషయం తెలుసుకొని ఎక్కడ చేస్తున్నారు అని అడగగా తిరుపతిలో జరుగుతుందని అబద్ధం చెప్పి ముంబైలో సీక్రెట్ గా నమ్రత మహేష్ బాబుల పెళ్లి చేసినట్టు కృష్ణ, విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.క్యాస్ట్ ఫీలింగ్ కారణంగా నమ్రత తో చాలా రోజులు మహేష్ బాబు అమ్మమ్మ మాట్లాడలేదట. ఇక మహేష్ పెళ్లయిన రెండు సంవత్సరాలకే మహేష్ అమ్మమ్మ చనిపోయింది.(Mahesh-Namrata)