Tollywood Anchor: 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఇరుక్కున్న టాలీవుడ్ హాట్ యాంకర్.?
Tollywood Anchor: చాలామంది ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు కూడా తొక్కుతారు. అలా కొంతమంది దొరికితే మరి కొంత గుట్టుచప్పుడు కాకుండా చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఎల్లో మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. 700 కోట్లు ల్యాండ్ స్కాం లో కొంతమంది ప్రముఖులు రాజకీయ నాయకులు ఉన్నారని అందులో ఒక టాలీవుడ్ హాట్ యాంకర్ పేరు కూడా వినిపిస్తోంది.మరి ఇంతకీ ఆ ల్యాండ్ స్కాం ఏంటి..ఇందులో ఇరుక్కున్న టాలీవుడ్ యాంకర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
Tollywood Anchor stuck in 700 crore land scam
ఏపీలో వైసిపి హయాంలో జరిగిన ఎన్నో కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అయితే తాజాగా ఇబ్రహీంపట్నంలో 700 కోట్ల ల్యాండ్ స్కాం బయటపడింది. దాదాపు 700 కోట్ల విలువ చేసే ఆస్తులని ఓ దొంగల ముఠా దోచేసినట్టు ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. ఏపీలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా దాదాపు 700 కోట్ల స్కాం జరిగిందని, ఈ 700 కోట్ల స్కామ్ లో రాజకీయానికి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని, అందులో వైఎస్ సునీల్, వైయస్ జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటపడ్డాయి. (Tollywood Anchor)
Also Read: Meenakshi: బాలకృష్ణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మీనాక్షి చౌదరి!!
ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లకు ఫిర్యాదు అందింది. ఇక రాజకీయ నాయకులే కాకుండా టాలీవుడ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ నటి రీతూ చౌదరి పేరు కూడా వినిపిస్తోంది.అలాగే చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం కి ఫిర్యాదు చేసిన లేఖలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ విశాఖపట్నం, రాజమండ్రి,విజయవాడలోని కోట్ల ఆస్తులను నాతో బలవంతంగా రిజిస్టర్ చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ లేఖ ప్రస్తుతం ఏపీ మొత్తం సంచలన సృష్టిస్తోంది.ఇందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ల పేర్లు బయటపడడంతో ఈ కేసు పై చంద్రబాబు నాయుడు సీరియస్ గా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.(Tollywood Anchor)