NEET-UG: ఢిల్లీలో హైటెన్షన్ డ్రామా.. CJP నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్

ఢిల్లీ పార్లమెంట్ మార్గంలో ఈరోజు భారీ ఉద్రిక్తత నెలకొంది. CJP ఆందోళనకారులు NEET-UG వివాదంపై నిరసన తెలుపుతూ, రైసినా రోడ్డు వైపు నుండి ఊరేగింపుగా పార్లమెంట్ భవనం దిశగా తరలివెళ్లారు. ఇది చూసిన పోలీసులు వారిని బారికేడ్లతో అడ్డుకున్నారు. అయినా నిరసనకారులు ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్ గా మారింది. భద్రతా బలగాలు మొదట వారిని హెచ్చరించి, ఆపై టియర్ గ్యాస్ షెల్లు సంధించడం, లాఠీచార్జ్ చేయడంతో వాతావరణం మరింత హీటెక్కింది.

CJP Parliament March High Tension

జంతర్ మంతర్ నుండి నేరుగా పార్లమెంట్ కు మార్చ్ చేపట్టాలన్నది సీజేపీ ఉద్దేశం. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సమీపంలో ఆందోళనకారులు గుమికూడగానే, పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్లను ఉపయోగించారు. ఈ నిరసన సభ్యులు బారికేడ్లను తోసిరాజనడంతో, వారిని అదుపు చేసే క్రమంలో సన్సద్ మార్గ్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే పెద్ద ఎత్తున లాఠీఛార్జి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఐటీవో, వికాస్ మార్గ్ సహా సెంట్రల్ ఢిల్లీలోని అనేక కీలక రూట్లలో కూడా ప్రదర్శనకారులను పోలీసులు నిలువరించారు.

ఈ ఘర్షణలో ఇరువైపులా గాయాలు సంభవించాయి. సుమారు 15 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో భాగంగా పార్లమెంట్ స్ట్రీట్ లో వేలాది మంది సీజేపీ కార్యకర్తలు చేరుకున్నారని, అక్కడ కూడా భారీగా లాఠీఛార్జ్ మరియు పొగ బాంబులు పేల్చినట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో రికార్డు అయ్యింది. ఈ మొత్తం డ్రామాలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండే ప్రధాన అజెండాగా ఉంది.

గాయపడిన వారికి అక్కడిక్కడే ప్రాథమిక చికిత్స చేసినట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్ భవనానికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ హైటెన్షన్ ఘట్టం ముగియడం గమనార్హం.

Share your love