Mahesh Babu: కృష్ణ వంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మురారి’. ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2001న విడుదలై భారీ విజయాన్ని అందుకోగా అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని, ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అదే రోజు సినిమాను మళ్ళీ విడుదల చేయాలనీ మహేష్ అభిమానులు కోరారు. వారి కోరికను గుర్తిస్తూ మేకర్స్ ఈ సినిమా ను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు దర్శకుడు కృష్ణ వంశీ.
Mahesh Babu Murari Director Clarification
ఈ క్రమంలోనే ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. రీ రిలీజ్ అయ్యే సినిమా కు ప్రమోషన్ ఏంటీ అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది ట్రెండ్ అవడంతో దర్శకుడు ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు నేటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానాలు చెబుతూ రాగా ఒక నెటిజన్ ఈ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్ చేశారు.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో కండీషన్ పెట్టిన గంభీర్..?
కృష్ణ వంశీ ఈ నెటిజన్ వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ, సినిమా కలెక్షన్ల గురించి ఓ స్పష్టం చేశారు. ఫస్ట్ రన్ లోనే 10 మిలియన్ డాలర్లు వచ్చాయని, కలెక్షన్ల పరంగా చూస్తే సినిమా డబ్బా లేక సూపర్ హిట్ అయ్యిందా అనే రివ్యూ వైరల్ అయ్యేదని అన్నారు.నేను మురారి నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావుగారి నుంచి రూ.55లక్షలకు ఐదేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కులను కొన్నాను. ఫస్ట్ రన్లో 1 కోటి 30 లక్షలు వచ్చాయని తెలిపారు.ఒకవేళ వసూళ్లే ప్రాతిపదిక అయితే, సినిమా ఫ్లాఫ్ లేదా సూపర్‌హిట్ అనేది మీరే నిర్ణయించుకోండి అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.