Lenin Collections: లెనిన్ సినిమాకు ఎన్ని కోట్లు ప్రాఫిట్స్ వచ్చాయి?

అక్కినేని అఖిల్ కెరీర్ లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ‘లెనిన్’ సినిమా ఫైనల్ గా ఎన్ని ప్రాఫిట్స్ తెచ్చింది అనేది ఇప్పుడు అందరి మైండ్ లో మెదులుతున్న question. జులై 10న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డేనే దాదాపు 16 కొట్లు వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఫుల్ పాజిటివ్ టాక్ తో అఖిల్ తొలి క్లీన్ హిట్ కొట్టడంతో అభిమానుల్లో జోష్ కనిపిస్తుంది.

Lenin Movie Actual Profits 2026

తాజా ట్రేడ్ అప్‌డేట్స్ ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకు 88 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేసారు. ఎప్పటిలాగే నిర్మాతలు కలెక్షన్స్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు కానీ, వాటిల్లో ఎంత నిజం ఉందనేది పెద్ద డిస్కషన్ గా మారింది. ఈ మధ్యే దిల్ రాజు, నాగవంశీ లాంటి బడా నిర్మాతలు తాము అనౌన్స్ చేసే కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని ఓపెన్ గా చెప్పుకోవడంతో జనాల్లో డౌట్స్ మొదలయ్యాయి. లెనిన్ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతూ, దాదాపు 20 కోట్ల వరకు fake collections చూపించారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

అయితే లెక్కలన్నీ పక్కన పెడితే, లెనిన్ మూవీ మాత్రం ఖచ్చితంగా హిట్ అయి ప్రాఫిట్స్ లోకి వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ సినిమా ఇప్పటి వరకు నిజమైన గ్రాస్ 65 కోట్ల పైనే collect చేసింది. థియేట్రికల్ బిజినెస్ కేవలం 25 కోట్లే జరిగింది కాబట్టి, బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన 50 కోట్ల మార్కును ఇది ఈజీగా క్రాస్ చేసింది. దాంతో, క్లియర్ గా 15 కోట్ల మేర ప్రాఫిట్స్ వచ్చినట్లు లెక్క తేలింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ అదనపు బోనస్, ZEE5 డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల కోసం 19 కోట్లు పెట్టగా, హిందీ వెర్షన్ 9 కోట్లకు అమ్ముడయింది. ఆడియో రైట్స్ ద్వారా మరో 6 కోట్లు రాగా, నాన్ థియేట్రికల్ బిజినెస్ నుంచే టోటల్ 34 కోట్ల భారీ రెవెన్యూ వచ్చింది.

మొత్తం మీద చూసుకుంటే, దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో break even అయి టేబుల్ ప్రాఫిట్ ను నిర్మాతలకు ఇచ్చింది. ఇప్పుడు ఈ వారం ‘జననాయకుడు’, ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి, లెనిన్ మొదట్లో రేంజ్ కలెక్ట్ చేయడం కష్టమే. కానీ, సక్సెస్ మీట్ లో నాగవంశీ అఖిల్ కి 100 కోట్ల సినిమా ఇవ్వాలని చెప్పడంలోనే ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అర్థమైపోతుంది. సో, ఫైనల్ గా అయ్యగారు ఒక పవర్ ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చేశారని చెప్పొచ్చు.

Share your love