Gamechanger vs Pushpa 2 clash

Allu Arjun Vs Ram Charan: ఈ సంవత్సరం డిసెంబర్ నెల టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఎంతో కనువిందు చేయనుంది. రెండు భారీ సినిమాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడం ఇప్పటికే తెలుగు నాట అందరినీ ఎంతో ఆసక్తి పరుస్తూ ఉండగా అవి కన్ఫర్మ్ అవ్వడం కూడా ఇప్పుడు ఎంతో కీలకంగా మారుతుంది. నిజానికి ఒకే నెలలో ఇంతటి రెండు భారీ చిత్రాలు విడుదల అవడం అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. ఇప్పటిదాకా ఏ నిర్మాత కూడా ధైర్యం చేయలేక పోయాడు. కానీ డిసెంబర్ నెలలో రెండు భారీ సినిమాలో రావడం ఖాయం అయిపోవడం ఇప్పుడు అంతట ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Gamechanger vs Pushpa2 Clash

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకు రెండవ భాగాన్ని సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ఇప్పటికే చిత్ర బృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని మొదట్లో భావించగా పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలకు వాయిదా వేశారు. ఫైనల్ గా ఈ సినిమా డిసెంబర్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి పోటీగా మరొక భారీ సినిమా లైన్లోకి రావడం ఇప్పుడు అందరిని ఆసక్తి కి పరుస్తుంది.

Also Read: What treat from “Viswambhara”?

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ట్విట్టర్లో దీనికి సంబంధించిన ఒక వార్తను పోస్ట్ చేయగా డేట్ మాత్రం చెప్పలేదని చెప్పాలి. పుష్ప సినిమా యొక్క విడుదల తేదీని బట్టి ఈ సినిమా యొక్క విడుదల ఉండబోతుంది అని తెలుస్తుంది.

అయితే సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వార్ భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. ఒకరినొకరు పచ్చి బూతులు తిట్టుకునేంతగా వీరి మధ్య యుద్ధం ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకే నెలలో రావడం వారి అభిమానులను ఏ విధంగా ఆలోచింపచేస్తుందో అనేది ఇక్కడ అసలు విషయం. త్వరలోనే గేమ్ చేంజెర్ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై నిర్మాత దిల్ రాజు ఓ నిర్ణయం ఇవ్వనున్నారు ఒకవేళ ఈ సినిమా డిసెంబర్లో విడుదలయితే మాత్రం తప్పకుండా డిసెంబర్ నెల ఆసక్తికరంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రెండు సినిమాల ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకెన్ని సినిమాలు డిసెంబర్ లో వస్తాయో చూడాలి.