Nani Mass Movie Saripodhaa Sanivaaram Buzz

Nani: ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టైర్ వన్ టైర్ టు అని రెండు వర్గాల హీరోలను మనం చూస్తున్నాం. కొంత స్టార్డం ఉన్న హీరోలను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలను టైర్ 1 హీరోలని పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా న్యాచురల్ స్టార్ నాని ఎప్పటినుంచో టైర్ 2 హీరో గా ఉంటూ ప్రేక్షకులను తన సినిమాల ద్వారా అలరిస్తున్నారు. మాస్ సినిమాలలో చేయడం ద్వారా మరింత మంది ప్రేక్షకులకు దగ్గరకి చేరుకోవచ్చు అనేది కొంతమంది హీరోలు చేసే ఆలోచన. ఆ విధంగా నాని మాస్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Nani Mass Movie Saripodhaa Sanivaaram Buzz

ఆ విధంగానే ఇటీవల ఆయన చేసిన దసరా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ సినిమా 50 కోట్ల మార్క్ ను చేరుకోగా ఈ సినిమా తర్వాత ఆయన చేసిన హాయ్ నాన్న పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు సరిపోడా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివేకాత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి నెలలో విడుదల కాబోతూ ఉండగా మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు వివేకాత్రేయ సినిమాను తెరకెక్కించాడని తెలుస్తుంది.

Also Read: Trivikram: త్రివిక్రమ్ కు డైరెక్షన్ కష్టాలు.. భయపడుతున్న హీరోలు!!

గతంలో వీరిద్దరూ కలిసి గతంలో అంటే సుందరానికి సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం అయింది. ఏదేమైనా ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా విజయవంతం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ చిత్రానికి బజ్ పెద్దగా లేకపోవడం ఈ సినిమా వస్తుందని కూడా ఎవరికి తెలియకపోవడం ఈ సినిమా ఫలితం ఏమవుతుందో అన్న టెన్షన్ చిత్ర బృందంలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ మాస్ యాక్షన్ సినిమా కూడా చేయబోతున్నాడు నాని. ఆయన వరుస ప్రాజెక్టులు చూస్తుంటే టైర్ 1 వెళ్లాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లే ఉంది. మరి నాని చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.