Ind Vs Aus 5Th Test: విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చిన BCCI ?
Ind Vs Aus 5Th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్ని క్రికెట్ గ్రౌండ్ లో చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గా జస్ప్రిత్ బుమ్రా వ్యవహరించాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో భాగం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్ గా నియమితుడయ్యాడు. కానీ మ్యాచ్ సమయంలో ఏదో జరిగింది. దాని కారణంగా విరాట్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. Ind Vs Aus 5Th Test
Virat Kohli Captain In Ind Vs Aus 5Th Test
నిజానికి సిడ్నీ టెస్ట్ రెండో రోజు జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత జస్ప్రిత్ బుమ్రా లేకపోవడంతో విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. కొంత సమస్యలో ఉన్నట్లు కనిపించాడు. అనంతరం కోహ్లీతో మాట్లాడి మైదానాన్ని వీడాడు. కోహ్లీతో మాట్లాడిన తర్వాత కారులో స్కాన్ కోసం హాస్పిటల్ కు వెళ్ళాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ లో భారత్ కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. జనవరి 2022లో టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. Ind Vs Aus 5Th Test
Also Read: KCR: కేసీఆర్ టచ్ లోకి బిజెపి నేతలు… ప్లాన్ B అదుర్స్ ?
2022 జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన 2-1 తేడాతో విరాట్ టెస్ట్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ ఈ బాధ్యతలను చూసుకున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదిలిపెట్టి ఉండవచ్చు కానీ అతను ఎప్పుడూ మైదానంలో చురుకుగా ఉంటాడు. ఆటగాళ్లకు అన్ని రకాలుగా సలహాలు ఇస్తూనే ఉంటాడు. రెండో ఇన్నింగ్స్ లో జస్ప్రిత్ బుమ్రా బ్యాటింగ్ కి వస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అసలు జస్ప్రిత్ బుమ్రాకు ఏమైందో ఇప్పటివరకు తెలియలేదు. Ind Vs Aus 5Th Test