IPL 2025: ఐపీఎల్ లోకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ దిశగా చర్చలు ఊపందుకున్నాయా అని అంటే అవుననే చర్చ జరుగుతోంది. మళ్లీ ఐపిఎల్ సీజన్ లో రాహుల్ ద్రావిడ్ కనిపించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. మొన్నటివరకు కోల్కతా నైట్ రైడర్స్ తో రాహుల్ జతకడతాడని చర్చ జరిగింది. ఎందుకంటే కేకేఆర్ మెంటార్ బాధ్యతల నుంచి గంభీర్ తప్పుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా కు హెడ్ కోచ్ అయ్యాడు. కేకేఆర్ లో గంభీర్ వదిలేసిన స్థానాన్ని ద్రావిడ్ భర్తీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ రాజస్థాన్ రాయల్స్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. IPL 2025
Key positions for Rahul Dravid and Yuvraj
ఆర్ఆర్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ తో కలిసి ద్రావిడ్ పనిచేశాడు. కెప్టెన్ గాను వ్యవహరించాడు. రాహుల్ కెప్టెన్సీలో 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ కు చేరింది. ఛాంపియన్స్ టీ20 లీగ్ లోనూ ఫైనల్స్ కు వెళ్ళింది. ఆటకు బై చెప్పాక రాజస్థాన్ రాయల్స్ కు మెంటార్ గా పనిచేశాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు కూడా సేవలు అందించాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టుకు కోచ్ గా సేవలు అందించాడు. టీమిండియాను హెడ్ కోచ్ గా గైడ్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలోనే భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ను అందుకుంది. సుదీర్ఘ సమయం తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. రాహుల్ గైడెన్సీలో టీమిండియా అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. IPL 2025
Also Read: IPL 2025: ముంబైకి గుడ్ బై…రోహిత్ కు 100 కోట్ల ఆఫర్ ?
వన్డే వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేసింది. పక్కా ప్లానింగ్ తో భారత జట్టును తనదైన స్టైల్ లో ద్రావిడ్ నడిపించాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిన భారత ఆటతీరు ఆకట్టుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి నుంచి తప్పుకోవాలనుకున్నాడు. కానీ రోహిత్ శర్మనే ఆపాడు. హెడ్ కోచ్ గా కొనసాగాలని ద్రావిడ్ కు సూచించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి భారత జట్టును తిరుగులేని జట్టుగా నిలబెట్టారు. అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చిన టోర్నీలో టీమిండియా కప్ అందుకునేలా చేశారు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ద్రావిడ్ గ్రాఫ్ కూడా పెరిగింది. IPL 2025
హెడ్ కోచ్ గా నియమించుకునేందుకు కొన్ని జట్లు పోటీపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో పనిచేసిన రాజస్థాన్ రాయల్స్ తో చేతులు కలిపేందుకు ద్రావిడ్ ఆసక్తిగా ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అరంగేట్ర సీజన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మల్లి ట్రోఫీ అందుకోలేదు. ఈసారి ఎలాగైనా టైటిల్ ను ముద్దాడాలని అనుకుంటుంది. ద్రావిడ్ కోచ్ గా ఉంటే అడ్వాంటేజ్ అవుతుందని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నమ్ముతుంది. ఇక అటు గుజరాత్ కోచ్ గా యువి రాబోతున్నాడట. IPL 2025