మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అది మరెవరో కాదు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ. ఇటీవలే తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ ఈ కుర్రాడికి సపోర్ట్ చేసిన మహేష్, సినిమా గురించి ఎగ్జైటింగ్ విషయాలు చెప్పాడు. జయకృష్ణ బాలీవుడ్ హీరోయిన్ రాషా తడానితో కలిసి ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో డెబ్యూ చేస్తున్నాడు. ఈ మూవీ జులై 30న రిలీజ్ కానుంది.
Mahesh Babu Supports Jayakrishna Entry
ఈ వీడియోలో మహేష్ బాబు మాట్లాడుతూ, తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. మా రమేష్ అన్నయ్య గారి అబ్బాయి జయకృష్ణ. అతను హీరోగా ఎంట్రీ ఇవ్వడం మా ఫ్యామిలీ అందరికీ సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా నేను చూసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘అల్లెల్లే’ సాంగ్ నాకు చాలా ఫేవరెట్. మేమంతా ఎగ్జైట్ అవుతున్నాము అని అన్నాడు. దర్శకుడు అజయ్ భూపతిని సరైన క్రెడిట్ ఇస్తూ, ఆయన జయకృష్ణ, రాషా పెయిర్ బాగా చూపించాడని చెప్పాడు. మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అయిందని తెలిపాడు.
ఇక రిలీజ్ డేట్ గురించి మహేష్ ఫన్నీగా చెప్పాడు. జులై 30 తేదీ నా ‘రాజకుమారుడు’ సినిమా రిలీజ్ డేట్ కూడా. నాకు తెలిసి నిర్మాత అశ్వినీదత్ గారే ఈ డేట్ ఖరారు చేసి ఉంటారు. దత్ గారు ఆల్డ్ స్కూల్ సినిమా బిజినెస్ నెంబర్ వన్. అల్లు అర్జున్, రామ్ చరణ్, నేను వైజయంతి నుంచే వచ్చాం. ఇప్పుడు జయకృష్ణ కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నాడు. ఇది గొప్ప విషయం అని అన్నాడు. బాబాయ్ ఆది శేషగిరి రావు సపోర్ట్ ని కూడా ప్రత్యేకంగా ఎత్తిచెప్పాడు.
చివరగా మహేష్ తన ఫ్యాన్స్ కి ఒక రిక్వెస్ట్ చేశాడు. కృష్ణగారి అభిమానులు, నా అభిమానులు అందరూ జయకృష్ణ, రాషాలను ఆదరించాలని నా కోరిక. వాళ్ళు ఈ విషయంలో లక్కీ. ఈ సినిమా మొత్తం టీమ్ కి, ముఖ్యంగా కొత్త హీరో హీరోయిన్ కి అల్ ది బెస్ట్ అని విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. జూలై 30న థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.





