Self Goal: భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్ ట్వీట్లతో సెల్ఫ్ గోల్

భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైఎస్ జగన్ ట్వీట్ ఒక క్లాసిక్ self goal అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ స్టయిల్ ఎప్పుడూ వివాదాస్పదమే, కానీ ఈసారి ఆయన పోస్ట్ మరింత చికాకు తెచ్చిపెట్టింది. ఆయన తన ట్వీట్లో, మొత్తం పని తమ ప్రభుత్వమే చేసిందనీ, ప్రస్తుత కూటమి సర్కార్ క్రెడిట్ మాత్రమే తీసుకుంటోందనీ రాసుకొచ్చారు. నిజానికి ఈ వ్యాఖ్యలు ఆయనకు అనుకున్నదానికి వ్యతిరేకంగా రిజల్ట్ ఇస్తున్నాయి.

Jagan Bhogapuram Airport Tweet Self Goal

వాస్తవం ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ వర్క్ చాలా వరకు 2014-19 మధ్య టీడీపీ అధికారంలోనే కంప్లీట్ అయ్యింది. దాదాపు 80% కన్స్ట్రక్షన్ అప్పట్లోనే జరిగిపోయింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగినా, అది చాలా చిన్న శాతం మాత్రమే. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ రెడీ అయి ఓపెన్ కావడం కూటమి హయాంలోనే. కానీ జగన్ మాత్రం మొత్తం క్రెడిట్ తనదే అనే ధోరణిలో ట్వీట్ చేయడం నెటిజన్లకు నవ్వు తెప్పించింది. ఆయన ట్వీట్ కింద కామెంట్స్ వర్షం కురుస్తోంది, మెజారిటీ జనాలు ఆయన లాజిక్ను క్వశ్చన్ చేస్తున్నారు.

ఇక్కడ రియల్ ట్విస్ట్ ఏంటంటే, ఒకప్పుడు జగన్ ఈ ఎయిర్పోర్ట్ను తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి ఇప్పుడు బయటకొస్తోంది. ఎర్రబస్సు కూడా వెళ్ళని ఊరిలో ఎయిర్బస్సు ఎందుకు అంటూ ఆయన కామెంట్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి భూములు రైతులకు తిరిగి ఇస్తామని చేసిన ప్రకటనలను netizens రీ-సర్ఫేస్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి దాని తర్వాత అధికారంలోకి వచ్చాక, అప్పటికే కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవడం, కాంట్రాక్టర్లను మార్చడం వల్ల పనులు ఆలస్యమయ్యాయనే విమర్శలు టీడీపీ, జనసేన వర్గాల నుంచి వస్తున్నాయి.

చివరగా, కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ను ఫాస్ట్గా పూర్తి చేసి ప్రజల్లోకి తెచ్చినప్పుడు, జగన్ మొత్తం క్రెడిట్ తనదంటే జస్ట్ కామెడీగా మిగిలిపోతోందని సోషల్ మీడియా యూజర్లు సెటైర్ చేస్తున్నారు. ఆయన ట్వీట్ ఇప్పుడు ఒక ఫన్నీ పొలిటికల్ మాక్ ఫెస్ట్గా మారింది, అక్కడ కోట్స్, రియాక్షన్స్ చూస్తుంటే పబ్లిక్ పల్స్ అర్థమవుతోంది. డ్యామేజ్ కంట్రోల్కు బదులు ఈ ట్వీట్ మరింత కౌంటర్కు దారితీసి అభాసుపాలు చేసింది.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love