Tea: “టీ”ని చాలామంది ఇష్టంగా తాగుతారు. టీ తాగని వారంటూ ఎవరూ ఉండరు. పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలంటే తప్పకుండా టీ తాగాల్సిందే. ఇక మరికొందరైతే ఉదయం లేచిన వెంటనే టీ తాగకుండా ఉండలేరు. ఇక చాలామంది వారి ఇష్టాన్ని బట్టి బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, మిల్క్ టీలను తాగుతూ ఉంటారు. అయితే ఇందులో చాలా ఇష్టంగా, ఎక్కువగా మిల్క్ టీ తాగుతారు. అయితే మిల్క్ టీని ఎక్కువగా మరిగించి తాగడానికి ఇష్టపడతారు. అయితే అలా ఎక్కువసేపు మరిగించడం వల్ల అనేకరకాల ఆనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Tea

Are you drinking Tea after boiling it too much

టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల స్లో పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా దీన్ని ఐదు నిమిషాలు మాత్రమే మరిగించాలి. అంతకన్నా ఎక్కువసేపు మరిగిస్తే అందులో క్యాన్సిల్ పరిమాణం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని పోషకాలను గ్రహించడానికి ఆటంకం కలుగుతుంది. కడుపునొప్పి, ఏసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా శరీరంలో కాల్షియం, ఐరన్, పోషకాహార లోపం ఏర్పడుతోంది. ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని రంగు, రుచి మారిపోతుంది. Tea

Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ కోసం ఆస్తి రాసిస్తానంటున్న హీరోయిన్ ?

ఎక్కువసేపు మరిగించిన టీని తాగడం వల్ల కోలోమైట్ అనే క్యాన్సర్ కారక ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. తద్వారా క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వస్తాయని, మలబద్ధకం కూడా తయారవుతుందని…. అలాంటి టీ ని తాగడం వల్ల అరగడానికి చాలా సమయం పట్టి కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా ఇది రక్తపోటును పెంచుతోంది. ఇందులో టానిన్ పరిమాణం పెరగడం వల్ల అధిక రక్తపోటు, రక్తస్రావం ఏర్పడుతుంది.Tea

ఇక ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు మరిగిస్తే ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్స్, అనేకరకాల పోషకాలు నశించి శరీరానికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఎక్కువసేపు మరిగించిన టీ తాగడం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. శరీరం నల్లగా తయారవుతుంది. జుట్టు కూడా ఊడుతుంది. అధిక బరువు పెరుగుతారు. అందువల్ల టీని కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మరిగించాలని…. అంతకుమించి మరిగించి తాగకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.