Indra and Mass: నాని హీరోగా రూపొందిన ‘సరిపోదా శనివారం’ చిత్రం ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆగస్టు నెలలో భారీగా సినిమాలు రాబోతున్న నేపథ్యంలో నాని సినిమాకు ఆ చిత్రాలు మంచి పోటీనే ఇస్తాయని చెప్పాలి. అయితే ఈ సినిమాలతో పాటు కొన్ని రీ రిలీజ్ సినిమాలు కూడా నానికి లేని కొత్త టెన్షన్ తీసుకు వస్తున్నాయని చెప్పాలి. వివేక ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని అప్డేట్లు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి.
Indra and Mass movies release on Nani movie
అంతేకాదు ఈ సినిమా సూపర్ హీరో తరహాలో ఉంటుంది అని అంటున్నారు. నాని వివేకాత్రేయ కాంబినేషన్లో గతంలో ‘అంటే సుందరానికి’ వంటి ఒక ఫ్లాప్ సినిమా రాగా ఇప్పుడు ఇదే కాంబో వెంటనే సినిమా చేయడం ఈ చిత్రం యొక్క ఫలితం పట్ల ఏ విధమైన ప్రభావం ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంద్రను ఇదే తేదీన మళ్ళీ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఆయన కెరియర్ లోనే పెద్ద మైలురాయిలుగా నిలిచిన ఇంద్ర సినిమా నానికి పెద్ద తలపోటుని తెచ్చేలా ఉంది.
Also Read: Sai Dharam Tej: స్టోరీ లో దమ్ములేదా.. సాయి ధరమ్ తేజ్ ఈ హంగులెందుకు!!
ఈ సినిమా కనీసం పది రోజులు రన్ అయినా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో మాస్ యాక్షన్ సినిమాలు వచ్చి చాలా రోజులైపోయిన నేపథ్యంలో ఇంద్ర లాంటి ఫ్యాక్షన్ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా వచ్చి చూస్తారని భావిస్తున్నారు నిర్మాతలు. అందుకే ఈ సినిమా ను మళ్లీ విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు. దాన్ని కూడా ఇదే తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇకపోతే ‘మాస్’ సినిమా నాగార్జునకు ఎంత ప్రత్యేకమైన సినిమానో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ను కూడా ఇదే తేదీ కి రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా నానికి రెగ్యులర్ గా వచ్చే సినిమాలు తలపోటు పెంచుతుంటే ఇప్పుడు మళ్లీ విడుదల అయ్యే ఈ రెండు సినిమాలు కూడా దాన్ని రెట్టింపు చేస్తున్నాయని చెప్పాలి. మరి ఈ చిత్రంపై ఆయా సినిమాల ప్రభావం ఎంతవరకు చూపుతుందో చూడాలి.