Cardamom: నోటి దుర్వాసనతో చాలామంది బాధపడుతూ ఉంటారు. నోటి దుర్వాసన అనేది సాధారణమైన సమస్య. ఇక దుర్వాసన రాకుండా చాలామంది ఏవేవో తింటూ ఉంటారు. అలాంటి వాటిలోనే యాలకులు ఒకటి. యాలకులు తినడం వల్ల నోటి దుర్వాసనని దూరం చేస్తాయి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే రెండు యాలకులను నమలడం వల్ల దుర్వాసన తొలగిపోయి నోరు తాజాగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్ ఉండడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. Cardamom

cardamoms every day is a check for cancer and 100 diseases

అంతేకాకుండా చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇక చాలా రకాల సర్వేల ప్రకారం యాలకులు తినడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. యాలకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి పరిష్కారం. ఇక యాలకుల్లో విటమిన్ సి ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. Cardamom

Also Read: Team India: గంభీర్ వచ్చాడు.. టీం ఇండియా ఎక్కడా తగ్గడం లేదు ?

చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే రెండు మూడు యాలకులను నమలడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు వంటి సమస్యలు తొలగిపోతాయి. చిన్నపిల్లలకు కూడా ఏదో ఒక రూపంలో యాలకులను తినిపించాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. తద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. Cardamom

అంతేకాకుండా యాలకులను తినడం వల్ల చిన్నపిల్లల పెరుగుదల బాగుంటుంది. ఇక చాలామంది యాలకులను స్వీట్స్ తయారీలో తప్పకుండా ఉపయోగిస్తారు. దీని ద్వారా చక్కటి సువాసనతో పాటు రుచి కూడా ఉంటుంది. అంతేకాకుండా బిర్యానీ వంటి స్పైసెస్ వంటకాలు చేసినప్పుడు తప్పకుండా యాలకుల పొడిని వాడుతారు. ఇక ఏదో ఒక రూపంలో తప్పకుండా యాలకులను తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Cardamom