Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి వార్తలు ఇప్పటికే ఎన్నోసార్లు వైరల్ అయ్యాయి. దానికి ప్రధాన కారణం ఆమె పవన్ తో విడిపోయాక ఎంగేజ్మెంట్ చేసుకోవడమే. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుంది.దానికి ప్రధాన కారణం తన తండ్రి చేసిన పనే అంటూ ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ చెప్పుకొని బాధపడింది.
Is Renu Desai father so mean
ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ మాట్లాడుతూ.. నేను పుట్టిన సమయంలో ఆడపిల్ల పుట్టిందని మా నాన్న నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. అంతేకాదు మా నాన్నకి మద్దతు తెలుపుతూ మా అమ్మ కూడా ఆయన వైపే నిలిచింది.కానీ అందులో నేనేం పాపం చేశానో నాకు తెలియదు. అలాగే నన్ను పనిమనిషి పెంచారు. నన్ను చంపడానికి కూడా మా నాన్న ముందుకు రాలేదు ఎందుకంటే నన్ను టచ్ చేయాల్సి వస్తుందని. (Renu Desai)
Also Read: Saripodaa Shanivaram: సరిపోదు నాని.. ఈ సినిమా ఉన్నట్లు కూడా ఎవరికీ తెలీదు!!
ఇక తల్లిదండ్రుల ఆదరణ లేకపోవడంతో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లాను.ఇక ఇదే పరిస్థితి నా పిల్లలకి వస్తే వాళ్ళు ఎలా ఫేస్ చేయగలరు అని నా మదిలో అనిపించింది. అందుకే అప్పటి పరిస్థితిని నేను గుర్తు చేసుకొని నా రెండో పెళ్లిని వాయిదా వేసుకున్నాను. నా సుఖ సంతోషాల కోసం నేను రెండో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నా పిల్లలు కూడా నేను ఎలా అయితే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండా డిప్రెషన్లోకి వెళ్లానో వాళ్లు కూడా అలాగే అయిపోతారు.
అందుకే నా పిల్లల కోసం నా రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే ఈమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈ వీడియో చూసి పాపం రేణు దేశాయ్ అలాంటి కష్టాలు అనుభవించిందా..ఆమె తండ్రి మరీ అంత నీచుడా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Renu Desai)