Hansika: హన్సికపై గృహహింస కేసు.. డబ్బు కోసం నన్ను టార్చర్ చేసిందంటూ కేసు పెట్టిన వదిన.?
Hansika: ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు వరుస వివాదాల్లో చిక్కుంటున్నారు. అలా తాజాగా హీరోయిన్ హన్సిక మోత్వాని కూడా పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంది.హన్సిక సోదరుడి భార్య హన్సికపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది.దీనితో హన్సిక ఫ్యాన్స్ షాక్ లో మునిగిపోయారు. మరి ఇంతకీ హన్సిక చేసిన తప్పేంటి..సోదరుడి భార్య హన్సికపై కేసు పెట్టడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. హన్సిక సోదరుడు ప్రశాంత్ హిందీ సీరియల్స్ లో చేసే నటి ముస్కాన్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Domestic violence case against Hansika
వీరి పెళ్లి 2021 లో జరిగింది. అయితే పెళ్లయ్యాక మనస్పర్దల కారణంగా వీరిద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. అయితే గత ఏడాది అంటే 2024 డిసెంబర్ 18న హన్సిక ఫ్యామిలీ మొత్తం మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టింది హన్సిక వదిన ముస్కాన్.. ఇక తన ఫిర్యాదులో ఈ విధంగా చెప్పింది. అత్తమామలతో పాటు నా భర్త సోదరి అయినటువంటి హన్సిక నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు. (Hansika)
Also Read: Anchor: సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ జైలుకు వెళ్లడం ఖాయమేనా.?
ప్రేమించి పెళ్లి చేసుకున్న మా మధ్య వీరి జోక్యం కారణంగా మా మధ్య గొడవలు వచ్చాయి.అత్త మామ హన్సిక వల్ల నేను చాలా టార్చర్ అనుభవించాను. ఇక ఈ టార్చర్ కారణంగా నేను మానసిక టార్చర్ కి గురై బెల్స్ పాల్సీ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాను. నా మొహం పాక్షిక పక్షవాతానికి గురైంది.నా మొహం ఉబ్బడంతో మా పేరెంట్స్ ఇది చూసి భయపడిపోతున్నారు.
మా పేరెంట్స్ కూడా హన్సిక ఫ్యామిలీ వల్ల ఇబ్బందులకు గురయ్యారు.నాకు పెళ్లి అయిన కొద్ది రోజులకే డబ్బు,నగలు,బహుమతులు తీసుకురావాలని అత్తింటి వాళ్ళు వేధించారు. అలాగే ఆస్తి విషయంలో కూడా ఏదో కుట్ర చేశారు. అంతేకాకుండా హన్సిక మా విషయంలో పదేపదే జోక్యం చేసుకోవడం వల్ల ఈ గొడవలు మరింత తీవ్రమయ్యాయి.. అంటూ నటి ముస్కాన్ తన ఫిర్యాదులో పేర్కొంది.ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ గా మారడంతో హన్సిక నిజస్వరూపం ఇదా అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.(Hansika)